iDreamPost
android-app
ios-app

వీడియో: ఇంటర్వ్యూ కోసం బాబర్‌ ఆజమ్‌ను ఆ భారత క్రికెటర్‌ అడుక్కున్నాడు!

  • Published Aug 02, 2024 | 4:26 PM Updated Updated Aug 02, 2024 | 4:26 PM

Harbhajan Singh, Irfan Pathan, Babar Azam: ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇంటర్వ్యూ కోసం పాకిస్థాన్‌ బాబర్‌ ఆజమ్‌ను అడుక్కుకున్నాడంటూ ఓ పాక్‌ అభిమాని వీడియో పోస్ట్‌ చేశాడు. దానిపై భజ్జీ ఎలా స్పందించాడో ఇప్పుడు చూద్దాం..

Harbhajan Singh, Irfan Pathan, Babar Azam: ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇంటర్వ్యూ కోసం పాకిస్థాన్‌ బాబర్‌ ఆజమ్‌ను అడుక్కుకున్నాడంటూ ఓ పాక్‌ అభిమాని వీడియో పోస్ట్‌ చేశాడు. దానిపై భజ్జీ ఎలా స్పందించాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 02, 2024 | 4:26 PMUpdated Aug 02, 2024 | 4:26 PM
వీడియో: ఇంటర్వ్యూ కోసం బాబర్‌ ఆజమ్‌ను ఆ భారత క్రికెటర్‌ అడుక్కున్నాడు!

భారత క్రికెటర్లపై ఏదో కామెంట్‌ చేస్తూ పబ్బం గడుపుకోవడం పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లతో పాటు పాక్‌ అభిమానులకు కూడా బాగా అలవాటు అయినట్లు ఉంది. తాజాగా ఓ పాక్‌ అభిమాని.. టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను ఇంటర్వ్యూ కోసం అడుక్కుకుంటున్నాడంటూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్‌ అయింది. భారత్‌ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో బాబర్‌ను కామెంటేటర్‌గా ఉన్న ఇర్ఫాన్‌ పఠాన్‌.. ఇంటర్వ్యూ కోసం ప్రాథేయపడుతున్నట్లు అతను పేర్కొన్నాడు.

అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఆ వీడియోలో ఇర్ఫాన్‌ పఠాన్‌ లేనే లేడు. ఆ వీడియో టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కంట్లో పడింది. అంతే.. ఆ వీడియోకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు భజ్జీ. అసలు అందుకో ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్కడున్నాడు. అయినా.. ఇర్ఫాన్‌ పఠాన్‌కు ఇంటర్వ్యూ ఇస్తే.. ఇంగ్లిష్‌లో ఒక ప్రశ్న అడిగితే బాబర్‌ ఆజమ్‌కు చెమటలు పడతాయంటూ హర్భజన్‌ సింగ్‌ సెటైర్లు వేశాడు. భజ్జీతో పాటు భారత క్రికెట్‌ అభిమానులు కూడా ఆ వివాదాస్పద పోస్ట్‌పై విరుచుకుపడుతున్నారు. మీతో ఇంటర్వ్యూ చేయడానికి చిన్న చిన్న యూట్యూబర్లు సరిపోతారని, అందుకోసం భారత మాజీ క్రికెటర్లు అవసరం లేదని మండిపడుతున్నారు.

కాగా, పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు, పాక్‌ అభిమానులు చేసే అర్థం లేని ఆరోపణలకు ఇర్పాన్‌ పఠాన్‌ సరైన కౌంటర్‌ ఇస్తాడనే విషయం తెలిసిందే. అందుకే పాక్‌ అభిమానులు ఎక్కువగా ఇర్ఫాన్‌ పఠాన్‌ను టార్గెట్‌ చేస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు ఇర్ఫాన్‌ పఠాన్‌కు హర్భజన్‌ సింగ్‌ మద్దతుగా నిలవడంతో భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. పాకిస్థాన్‌ అభిమానులు ఇలాంటి చీప్‌ కామెంట్స్‌ కానీ, పోస్టులు కానీ చేసినప్పుడు.. భారత క్రికెటర్లు ఇలా రియాక్ట్‌ అయితే బాగుంటుందని కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.