SNP
SNP
2021 జనవరిలో ఆస్ట్రేలియాతో ఎస్‌సీజీ గ్రౌండ్‌లో జరిగిన టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి తెలుగు కుర్రాడు హనుమ విహారి చూపించిన పోరాట పటిమను ఏ భారతీయ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేదు. ఆ ఇన్నింగ్స్ చూసి.. టీమిండియాకు మరో పదేళ్ల వరకు విహారి వెన్నెముకలా ఉండటాడని అంతా భావించారు. కానీ, సెలెక్టర్ అనూహ్య నిర్ణయాలతో విహారి ప్రస్తుతం జట్టులో లేకుండా పోయాడు. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు హనుమ విహారిని ఎంపిక చేయలేదు. అంతకు ముందు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా విహారి ఆడలేదు.
టీమిండియాలో చోటు కోల్పోయినా నిరాశ చెందకుండా దేశవాళీ క్రికెట్‌లో విహారీ తన సత్తా చాటుతున్నాడు. అయినా కూడా డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు విహారిని ఎంపిక చేయలేదు. దీంతో క్రికెట్ అభిమానులు సైతం సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విహారి దులీప్ ట్రోఫీ గెలవడంతో మరోసారి టీమిండియా నుంచి విహారిని తప్పించిన విషయం చర్చనీయాంశంగా మారింది. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి, కెప్టెన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. ఏకంగా సౌత్ జోన్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. తనను టీమిండియా నుంచి తప్పించిన సెలెక్టర్ల దిమ్మతిరిగిపోయేలా ట్రోఫీతో బదులిచ్చాడు.
ఫైనల్లో సౌత్ జోన్ వెస్ట్ జోన్‌పై 75 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌లో 298 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్ ఐదో రోజు ఉదయం 5 వికెట్లకు 182 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఆ జట్టు 222 పరుగులకే ఆలౌట్ అయింది. సౌత్ జోన్ నుంచి లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్, పేసర్ వాసుకి కౌశిక్ తలో 4 వికెట్లు పడగొట్టారు. సౌత్ జోన్ బ్యాటింగ్‌లో హనుమ విహారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. టీమిండియాలో రీ ఎంట్రీపై విహారి గట్టి నమ్మకంతో ఉన్నాడు. 35 ఏళ్ల రహానే టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వగలేనిది.. 29 ఏళ్ల తాను ఎందుకు ఇవ్వలేనని, భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తానని అన్నాడు. మరి విహారిని భారత టెస్ట్ జట్టు నుంచి తప్పించడం, దులీప్ ట్రోఫీ గెలిచి అతను సత్తా చాటాడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Hanuma Vihari with the Duleep Trophy 2023.
He scored 63(130) in 1st innings & 42(89) in 2nd innings in final – Legend. pic.twitter.com/szuUOJGQfM
— Johns. (@CricCrazyJohns) July 16, 2023
ఇదీ చదవండి: ఇద్దరు సీనియర్లను ఇంటికి పంపిన ఆర్సీబీ! డివిలియర్స్ రీ ఎంట్రీ