కొంత మంది క్రికెటర్లు తీసుకునే నిర్ణయాలు ఒక్కొసారి అభిమానులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఆంధ్రా క్రికెట్ అభిమానుల తీవ్ర నిరాశకు గురైయ్యారు. డొమాస్టిక్ క్రికెట్ లో ఆంధ్రా జట్టుకు విహారి కీలక ఆటగాడు. అయితే రాబోయే దేశవాళీ సీజన్ లో విహారి ఆంధ్రా జట్టుకు ఆడటం లేదట. ఈ క్రమంలోనే ఆంధ్రా జట్టుకు విహారి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
హనుమ విహారి.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రంజీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించే విహారి.. ఇకపై ఆ జట్టులో కనిపించడు. అవును ఆంధ్రా జట్టు నుంచి మధ్యప్రదేశ్ జట్టుకు విహారి మారుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తో వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదీకాక సోమవారం జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ సెలక్షన్ కమిటీ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించనున్నట్లు ప్రముఖ వార్త పత్రిక తన రిపోర్ట్ లో తెలిపింది.
మధ్యప్రదేశ్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలో 2022 రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్ జట్టుకు ఇదే తొలి రంజీ ట్రోఫీ కావడం విశేషం. ఇక జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు విహారి. కాగా.. విహారితో పాటుగా ఢిల్లీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కుల్వంత్ ఖేజ్రోలియా కూడా రాబోయే రంజీల్లో మధ్యప్రదేశ్ తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. విహారి లాంటి ఆటగాడు ఆంధ్రా జట్టును వీడిపోవడం జట్టుకు నష్టంగానే క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
Hanuma Vihari has moved on from Andhra Pradesh and will play for Madhya Pradesh in the upcoming domestic season. (Reported by TOI). pic.twitter.com/q9QCBrubYy
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2023