iDreamPost
android-app
ios-app

నాపై ఆ ముద్ర సరికాదు.. టీమ్‌ నుంచి ఎందుకు తీసేశారో తెలియదు: విహారి

  • Published Jul 12, 2023 | 12:13 PMUpdated Jul 12, 2023 | 12:13 PM
  • Published Jul 12, 2023 | 12:13 PMUpdated Jul 12, 2023 | 12:13 PM
నాపై ఆ ముద్ర సరికాదు.. టీమ్‌ నుంచి ఎందుకు తీసేశారో తెలియదు: విహారి

కొంతకాలం క్రితం వరకూ టీమిండియా టెస్ట్‌ టీమ్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఉన్న హనుమ విహారి ప్రస్తుతం టీమ్‌లో చోటు కోల్పోయాడు. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు విహారిని ఎంపిక చేయలేదు. దీంతో విహారి ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో ఆడుతున్నాడు. సౌత్‌ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి.. టీమ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. అయితే.. టీమిండియాలో చోటు కోల్పోవడం గురించి మాట్లాడుతూ.. తనను టీమ్‌ నుంచి ఎందుకు తప్పించారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే టీమ్‌ నుంచి తనను తప్పించిన విషయం కూడా తనకు చెప్పలేదని వాపోయాడు.

అయితే.. టీమ్‌ నుంచి తప్పించినందుకు తాను కుంగిపోవడం లేదని, తన వయసు ఇంకా 29 ఏళ్లు మాత్రమేనని, 35 ఏళ్ల వయసులో రహానె జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడని.. తాను కూడా అలానే శ్రమించి టీమ్‌లోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. జట్టులో ఉన్నప్పుడు అవకాశం వచ్చిన ప్రతిసారీ టీమ్‌ విజయం కోసం నా వంతు కృషి చేశానని తెలిపాడు. అయితే తన ప్రదర్శన సరిపోకపోవచ్చని వెల్లడించాడు.

ఇక తాను నెమ్మదిగా ఆడుతానని, తానో టెస్ట్‌ ప్లేయర్‌ అని తనపై ముద్ర వేయడం సరికాదని విహారి స్పష్టం చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌ చాలా భిన్నమైనదని, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేయాల్సి వస్తుందని అన్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ధాటిగా ఆడాల్సిన సందర్భం రావడంతో వేగంగా ఆడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. దులీప్‌ ట్రోఫీలో భాగంగా నార్త్‌ జోన్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌, రెండో ఇన్నింగ్స్‌లో విహారి 42 బంతుల్లో 43 పరుగులు చేసి సౌత్‌ జోన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. కానీ, ప్రస్తుతం టీమ్‌లో లేడు. మరి విహారిని పక్కనపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గడ్డం.. వరల్డ్‌ కప్‌కు అడ్డమని రోహిత్‌ భావిస్తున్నాడా? ఇందులో నిజమెంతా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి