SNP
SNP
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ హనుమ విహారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య ప్రీతి ఈ నెల 7న పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చినట్లు విహారి తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపాడు. బాబుకు ‘ఇవాన్ కీష్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు. దీంతో క్రికెట్ అభిమానులు విహారి-ప్రీతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. ఈ సంతోషకరమైన విషయాన్ని విహారి చాలా ఆలస్యంగా ప్రపంచంతో పంచుకున్నాడు. అందుకు కారణం తెలియకపోయినా.. దులీప్ ట్రోఫీలో ఆడుతున్న క్రమంలోనే తనకు బాబు పుట్టిన విషయాన్ని విహారి వెల్లడించలేదని అభిమానులు భావిస్తున్నారు.
కాగా.. విహారి కెప్టెన్‌గా సౌత్ జోన్‌ను దులీప్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. కొడుకు పుట్టకతో విహారికి కలిసి వచ్చింది.. అందుకే కప్పు కొట్టాడని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే.. టీమిండియా టెస్ట్ టీమ్‌లో చోటు కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తూ.. తన టీమ్‌కు బ్యాక్‌బోన్‌గా మారాడు విహారి. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు టీమ్‌లో విహారికి చోటు దక్కుతుందని అంతా భావించినా అది జరగలేదు. కనీసం దులీప్ ట్రోఫీలో అతని ప్రదర్శన చూసి దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపిక చేస్తారని భావించినా అదీ జరగలేదు. అయినా.. కూడా దులీప్ ట్రోఫీ గెలిచిన సంతోషం, బాబు పుట్టిన ఆనందంలో ఉన్నాడు విహారి.
ధోని బర్త్‌డే రోజే..
హనుమ విహారి బాబు పుట్టిన రోజు, ధోని బర్త్‌డే ఒకే రోజు కావడం విశేషం. భారత క్రికెట్‌లో ధోనికి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన గొప్ప కెప్టెన్‌గా ధోని నిలిచాడు. అలాంటి ఆటగాడు పుట్టిన రోజునే తనకు కుమారుడు జన్మించడం.. విహారి కెప్టెన్‌గా దులీప్ ట్రోఫీ గెలివడం అంతా ఓ మెరాకిల్ లాగా ఉందని అభిమానులు అంటున్నారు. పైగా 7 నంబర్‌కు ఉన్న పవర్ విహారి కుమారుడికి కలిసి వస్తుందని జోతిష్యం చెబుతున్నారు. విహారి ఎలాగో టీమిండియా క్రికెటర్ కాబ్టటి.. అతని కొడుకుపై కూడా క్రికెట్ ప్రభావం ఉంటుందని, భవిష్యత్తులో అతను కూడా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ధోని అంతటి గొప్ప క్రికెటర్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. 7 నంబర్‌లో, ఆ తేదీలో ఉన్న సంఖ్యా బలం అలాంటిదని పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని దగ్గర ఎన్ని బైకులున్నాయో! షోరూమ్‌లో కూడా అన్ని ఉండవ్..