iDreamPost
android-app
ios-app

బయట ఇంత లక్షణంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఓ స్టార్ క్రికెటర్.. గుర్తు పట్టారా?

  • Published May 04, 2024 | 5:43 PM Updated Updated May 04, 2024 | 5:43 PM

Guess This Cricketer: ఇప్పుడు క్రికెట్ లో అబ్బాయిలో కాదు.. అమ్మాయిలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ అమ్మాయి కూడా ఒక టీమిండియా ఉమెన్ క్రికెటరే.. గుర్తు పట్టారా?

Guess This Cricketer: ఇప్పుడు క్రికెట్ లో అబ్బాయిలో కాదు.. అమ్మాయిలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ అమ్మాయి కూడా ఒక టీమిండియా ఉమెన్ క్రికెటరే.. గుర్తు పట్టారా?

  • Published May 04, 2024 | 5:43 PMUpdated May 04, 2024 | 5:43 PM
బయట ఇంత లక్షణంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఓ స్టార్ క్రికెటర్.. గుర్తు పట్టారా?

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు అందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మజాని ఆస్వాదిస్తున్నారు. ఇంకో నెలలో టీ20 వరల్డ్ కప్ కూడా జరగబోతోంది. ప్రస్తుతానికి క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఎలాంటి డోకా లేదు. అయితే మీరు చాలా సందర్భాల్లో క్రికెటర్స్ ని చూస్తూనే ఉంటారు. పురుషులైనా.. మహిళలు అయినా సాధ్యమైనంత వరకు వెస్ట్రన్ వేర్ లోనే ఉంటారు. అది వాళ్లకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది. అయితే మీరు పైన ఉన్న పిక్ లో లంగాఓణీలో చూసి భలే లక్షణంగా ఉందే ఏ సీరియల్ ఆర్టిస్టో అని కన్ఫ్యూజ్ కాకండి. ఆ అమ్మాయి ఓ స్టార్ క్రికెటర్. ఆమెను గుర్తు పట్టారా?

గతంతో పోలిస్తే.. ఇప్పుడు మహిళా క్రికెట్ కు కూడా ఆదరణ పెరిగింది. ఉమెన్స్ టీమ్ మ్యాచ్ జరుగుతోంది అంటే లైవ్ కూడా చూసేస్తున్నారు. అలాగే ఉమెన్ ప్రీమియర్ లీగ్ రెడో సీజన్ కూడా గట్టిగానే హిట్ అయ్యింది. పైగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కలగా మిగిలిన టైటిల్ ను అమ్మాయిలు తీసుకొచ్చారు. రెండో సీజన్ లోనే టైటిల్ విన్నర్స్ గా నిలిచారు. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ లంగాఓణీ అమ్మడు కూడా టైటిల్ విన్నింగ్ టీమ్ లో ఉన్నదే. జట్టు గెలిచిన తర్వాత ఆనందంతో గంతులేస్తూ టైటిల్ ని ముద్దాడిన ఇమేజ్లు, వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ అమ్మడు టీమిండియా ఉమెన్ టీమ్లో కూడా కీలక స్పిన్నర్. ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా ఆ లేడీ క్రికెటర్ మరెవరో కాదు.. శ్రేయాంక పాటిల్. ఈమె రైట్ ఆర్మ్ హాఫ్ బ్రేకర్ బౌలర్. శ్రేయాంక పాటిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక బోర్డుకు ఆడుతూ ఉంటుంది. టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి 2023 డిసెంబర్ లో అరంగేట్రం చేసింది. మొదట ఇంగ్లాండ్ పై టీ20 ఫార్మాట్, ఆ తర్వాత డిసెంబర్ లోనే ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మాట్లో అడుగుపెట్టింది. ఈ అమ్మడు వేసే బౌలింగ్ కి హేమాహేమీలు కూడా పెవిలియన్ చేరాల్సిందే. ఇప్పటికే టీమిండియాలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

శ్రేయాంక పాటిల్ మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా చిచ్చర పిడుగే. రీల్స్, ఫొటోలు పెడుతూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. ఒకసారి పక్కా మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తుంది. మరోసారి లంగాఓణీలో ఎంతో లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. మైదానంలో మాత్రం ప్రత్యర్థులపై విజృభిస్తూ ఉంటుంది. ఆర్సీబీ తరఫున ఈమె బౌండరీ మీద సిక్స్ ని సేవ్ చేసిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. టీమిండియా క్రికెటర్ అయ్యుండి కూడా ఎంతో సింపుల్ గా ఉంటుంది. బాగా అల్లరి చేస్తూ ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom