SNP
Great Britain, Hockey, IND vs GB, Indian Hockey, Paris Olympics 2024: మనల్ని 200 ఏళ్ల పాటు పరిపాలించి.. బానిసల్లా చూసి.. మన సంపదను దోచుకెళ్లిన ఆంగ్లేయులను తాజాగా టీమిండియా ఏడిపించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Great Britain, Hockey, IND vs GB, Indian Hockey, Paris Olympics 2024: మనల్ని 200 ఏళ్ల పాటు పరిపాలించి.. బానిసల్లా చూసి.. మన సంపదను దోచుకెళ్లిన ఆంగ్లేయులను తాజాగా టీమిండియా ఏడిపించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా అంటే చాలా మంది భారత క్రికెట్ జట్టు మాత్రమే అనుకుంటూ ఉంటారు.. కానీ, అసలు టీమిండియా అంటే హాకీ జట్టే. ఎందుకుంటే.. హాకీ మన జాతీయ క్రీడా. ఒలింపిక్స్ ఎంతో గొప్ప చరిత్ర ఉంది మన భారత హాకీ జట్టుకు. కానీ, క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగిపోవడంతో హాకీకి ఆదరణ తగ్గిపోయింది. ప్రజల నుంచి పెద్ద ఆదరణ లేకపోయినా.. భారత హాకీ జట్టు సంచలనాలు నమోదు చేస్తూ.. ఇండియన్ హాకీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతిష్టాత్మక జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ 2024 అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది టీమిండియా.
ఒలింపిక్స్ హాకీ ఈవెంట్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది భారత జట్టు. క్వార్డర్ ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్-గ్రేట్ బ్రిటన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ టీమిండియానే చేసింది. ఆ తర్వాత బ్రిటన్ ఆటగాడు గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. మ్యాచ్ నిర్ణీత సయం పూర్తి అయ్యే సరికి.. 1-1తో రెండు టీమ్స్ సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో.. షూట్ అవుట్‌ను నిర్వహించారు. ఈ షూట్ అవుట్‌లో 4-2తో టీమిండియా.. గ్రేట్ బ్రిటన్‌ను చిత్తు చేసి సగర్వంగా పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మరొక్క విజయం సాధిస్తే.. ఇండియాకు కచ్చితంగా ఒక ఒలింపిక్ మెడల్ దక్కుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు ఈసారి గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. ఆ బాటలోనే ఇప్పుడు సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఒకప్పుడు మనల్ని 200 ఏళ్లు పరిపాలించి, మన సంపద మొత్తం దొచుకెళ్లి, మనల్ని బానిసల్లా చూసిన బ్రిటన్.. ఇప్పుడు మన చేతుల్లో ఓడిపోయిందని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే మ్యాచ్ తర్వాత ఓ బ్రిటన్ ఆటగాడు గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మనల్ని ఏడిపించిన ఆంగ్లేయులను ఇప్పుడు టీమిండియా ఏడిపించిందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Great Britain players in tears after the Quarter Finals exit. pic.twitter.com/MXqncmzS4n
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024