iDreamPost
android-app
ios-app

IND vs ENG: అతడిని రెచ్చగొడితే గ్రౌండ్ లో యుద్ధమే.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ వార్నింగ్

  • Published Jan 11, 2024 | 2:40 PM Updated Updated Jan 11, 2024 | 2:40 PM

ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్, స్టార్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తమ ఆటగాళ్లను ముందుగానే హెచ్చరించాడు. గ్రౌండ్ ఆ టీమిండియా ఆటగాడి జోలికి వెళ్లొద్దని, అతడిని గెలికితే మైదానంలో యుద్దమే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చాడు. మరి గ్రేమ్ స్వాన్ చెప్పిన ఆ ప్లేయర్ ఎవరు?

ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్, స్టార్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తమ ఆటగాళ్లను ముందుగానే హెచ్చరించాడు. గ్రౌండ్ ఆ టీమిండియా ఆటగాడి జోలికి వెళ్లొద్దని, అతడిని గెలికితే మైదానంలో యుద్దమే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చాడు. మరి గ్రేమ్ స్వాన్ చెప్పిన ఆ ప్లేయర్ ఎవరు?

IND vs ENG: అతడిని రెచ్చగొడితే గ్రౌండ్ లో యుద్ధమే.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ వార్నింగ్

టీమిండియా ప్రస్తుతం ఆఫ్గాన్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాళ్లు టీమిండియా ప్లేయర్లపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్, స్టార్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తమ ఆటగాళ్లను ముందుగానే హెచ్చరించాడు. గ్రౌండ్ ఆ టీమిండియా ఆటగాడి జోలికి వెళ్లొద్దని, అతడిని గెలికితే మైదానంలో యుద్దమే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చాడు. మరి గ్రేమ్ స్వాన్ చెప్పిన ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది టీమిండియా. తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను ముందుగానే హెచ్చరించాడు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ గ్రేమ్ స్వాన్. స్కై స్పోర్ట్స్ తో గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ..”మీకు నేను ముందుగానే చెబుతున్నాను. గ్రౌండ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో మాటల యుద్ధానికి దిగకండి. ఒకవేళ అతడిని గెలికితే.. ఇక అంతే సంగతులు, వార్ వన్ సైడ్ అయిపోద్ది. మీ చేష్టలకు కోహ్లీ తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తాడు. విరాట్ దండయాత్రను మీరు తట్టుకోలేరు. మైదానంలో కోహ్లీ ఓ యుద్ధాన్ని సృష్టిస్తాడు జాగ్రత్త” అంటూ వార్నింగ్ ఇచ్చాడు గ్రేమ్ స్వాన్. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

కింగ్ కోహ్లీ గురించి బాగానే తెలుసుకున్నావ్ స్వాన్.. అందుకే మీ వాళ్లను ముందుగానే హెచ్చరిస్తున్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు విరాట్ తో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటది మరి అని రాసుకొస్తున్నారు. ఇక ఈ టెస్ట్ సిరీస్ ను నెగ్గి.. మళ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకురావాలని టీమిండియా ఆరాటపడుతోంది. కాగా.. ఇంగ్లాండ్ ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయ్యింది. పసికూన జట్ల కంటే ముందుగానే ఇంటిదారిపట్టి అవమానాన్ని మూటగట్టుకుంది. మరి విరాట్ కోహ్లీ విషయంలో తమ ఆటగాళ్లను గ్రేమ్ స్వాన్ హెచ్చరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.