iDreamPost
android-app
ios-app

టీమిండియా గెలుపుల్లో ఆ నలుగురు! వీరి అదృష్టానికి అదే కారణమా?

  • Published Oct 30, 2023 | 6:55 PM Updated Updated Oct 31, 2023 | 12:52 PM

వరల్డ్‌ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉండి, ఒకరు కాకుంటే మరొకరు జట్టును గెలిపిస్తున్నారు. అయితే.. కొంతమంది స్టార్‌ ఆటగాళ్ల ఈ అద్భుత ప్రదర్శన వెనుక ఓ అతీత శక్తి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉండి, ఒకరు కాకుంటే మరొకరు జట్టును గెలిపిస్తున్నారు. అయితే.. కొంతమంది స్టార్‌ ఆటగాళ్ల ఈ అద్భుత ప్రదర్శన వెనుక ఓ అతీత శక్తి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 30, 2023 | 6:55 PMUpdated Oct 31, 2023 | 12:52 PM
టీమిండియా గెలుపుల్లో ఆ నలుగురు! వీరి అదృష్టానికి అదే కారణమా?

టీమిండియా వరుస విజయాలతో అద్భుతంగా దూసుకెళ్తోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ లాంటి పెద్ద జట్లను ఓడించిన భారత్‌.. ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్లపై కూడా గెలిచింది. తాజాగా ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ముందు ఈ టార్గెట్‌ చాలా చిన్నదిగా కనిపించినా.. మన బౌలింగ్‌ ఎటాక్‌ ముందు ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ నిలువలేకపోయింది. కేవలం 129 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌటై.. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అయితే.. ప్రస్తుతం టీమిండియా సాధింస్తున్న ఈ విజయాల వెనుక కొంతమంది ఆటగాళ్ల శ్రమ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గత రెండు మ్యాచ్‌ల నుంచి ఆడుతున్న షమీ ఒక్కడిని పక్కన పెడితే.. టీమిండియా విజయాల్లో విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు కాస్త ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్లు అంత అద్భుతంగా రాణిస్తున్నారు. టీమిండియా బౌలర్లు.. బుమ్రా, జడేజా, కుల్దీప్‌, సిరాజ్‌ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ప్రదర్శనే చేశారు. కానీ, కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌ రాణిస్తుండటంతో జట్టు మొత్తంలో విశ్వాసం నింపుతోంది. ప్రస్తుతం టీమిండియా ఇంత పటిష్టంగా ఉందంటే.. అది వీరి చలవే.

అయితే.. వీరంత ఇంత నిలకడగా రాణించడానికి వెనుక ఓ అతీత శక్తి ఉందని క్రికెట్‌ అభిమానులు నమ్ముతున్నారు. వరల్డ్‌ కప్‌ కంటే ముందు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌ పలు ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. వీళ్లందరికి దైవ భక్తి ఎక్కువ. అదే ఇప్పుడు వీరికి మరింత శక్తినిచ్చి ఈ వరల్డ్‌ కప్‌లో ముందుకు నడిపిస్తోంది చాలా మంది క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఈ వరల్డ్‌ కప్‌లో ప్రస్తుతం టీమిండియా తరఫున రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టాస్‌ స్కోరర్లుగా ఉన్నారు. అలాగే కుల్దీప్‌ యాదవ్‌ సైతం అద్భుత బౌలింగ్‌తో టీమిండియాలో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ మిడిల్డార్‌లో టీమిండియా అండగా ఉండటమే కాక, వికెట్‌ కీపర్‌గా వందకు వంద మార్కులు కొట్టేస్తున్నాడు. మరి ఈ నలుగురు స్టార్ల విజయాల వెనుక దైవశక్తి కూడా ఉందని అంటున్న ఫ్యాన్స్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Naman Jain (@n1511.edits)