SNP
క్రికెట్‌లో కొన్ని సార్లు ఆటగాళ్లు అందుకునే క్యాచ్‌లు అద్భుతంగా ఉంటాయి. అలాంటి క్యాచ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.. ఎన్ని సార్లు చూసి.. ఒక సూపర్ క్యాచ్ చూసిన ఫీలింగ్ ప్రతి సారి కలుగుతుంది. అలాంటి క్యాచే ఇది కూడా.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్రికెట్‌లో కొన్ని సార్లు ఆటగాళ్లు అందుకునే క్యాచ్‌లు అద్భుతంగా ఉంటాయి. అలాంటి క్యాచ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.. ఎన్ని సార్లు చూసి.. ఒక సూపర్ క్యాచ్ చూసిన ఫీలింగ్ ప్రతి సారి కలుగుతుంది. అలాంటి క్యాచే ఇది కూడా.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్‌లో ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టడం సర్వసాధారణం. ప్రతి మ్యాచ్‌లో క్యాచ్‌లు పడుతూనే ఉంటారు. కానీ, కొన్ని క్యాచ్‌లు మాత్రం.. వావ్ అనేలా ఉంటాయి. అసాధ్యమైన క్యాచ్‌లను ఫీల్డర్లు అందుకుంటే.. సొంత జట్టు ఆటగాళ్లే కాదు ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా నోరెళ్లబెట్టడం ఖాయం. అలాంటి క్యాచ్‌ల లిస్ట్‌లోకే వస్తుంది ఈ క్యాచ్ కూడా. సాధారణంగా ఒక మంచి క్యాచ్ అందుకున్నప్పుడు కళ్లు చెదిరే క్యాచ్ అని అంటుంటారు.. కానీ, ఇది కళ్లు చెదిరే క్యాచ్‌తో పాటు.. ఒళ్లు ఝలదరించే క్యాచ్ కూడా. క్యాచ్ పట్టిన విధానం చూస్తే.. అతని అతని బాడీలో ఎముకలు ఉన్నాయా? అసలు అతను మనిషేనా లేక సూపర్ మ్యానా? అనే అనుమానం కలగకమానదు. ఇంతకీ ఈ అద్భుతమైన పట్టింది ఎవరనుకుంటున్నారా? న్యూజిలాండ్ సెన్సేషన్ గ్లెన్ ఫిలిప్స్.
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ సూపర్ క్యాచ్ చోటు చేసుకుంది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 60వ ఓవర్‌ను న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని ప్రొటీస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న ఆ బంతిని గాల్లోకి అమాంతం దూకి.. సూపర్ మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్. ఆ క్యాచ్ చూసి.. న్యూజిలాండ్ ఆటగాళ్లే కాదు.. సౌతాఫ్రికా ప్లేయర్లు సైతం షాక్ అయ్యారు. అసలు అలా ఎలా పట్టాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు అలానే అంతా షాకై చూశారు. స్లో మోషన్‌లో రిప్లే చూస్తే కాని.. ఫిలిప్స్ చేసిన అద్భుతం అర్థం కాలేదు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసి.. 242 పరుగులకు ఆలౌట్ అయింది. రువాన్ డి స్వర్డ్ 64 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. కివీస్ బౌలర్లలో విలియమ్ 4, రచిన్ రవీంద్ర 3 వికెట్లు పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కూడా కేవలం 211 పరుగులకే ఆలౌట్ అయింది. లాథమ్ 40, విలియమ్సన్ 43 పరుగులు చేసి రాణించారు. ప్రొటీస్ బౌలర్లలో డేన్ పీడ్ట్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అలాగే డేన్ పీటర్సన్ 3 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బెండింగ్‌హమ్ 110 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, మిగతా వాళ్లు రాణించలేదు. ఇక 267 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 40 పరుగులు చేసింది. కివీస్ విజయానికి ఇంకా 227 పరుగులు కావాలి. సౌతాఫ్రికాకు 9 వికెట్లు అవసరం. మరి ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Glenn Phillips 🦸pic.twitter.com/1s1J6wLKl1
— CricTracker (@Cricketracker) February 15, 2024