SNP
Glenn Mcgrath, Jasprit Bumrah, T20 World Cup 2024: ఐర్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియాకు ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వేసిన ఒక ప్రశ్న దిమ్మతిరిగిపోయేలా ఉంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
Glenn Mcgrath, Jasprit Bumrah, T20 World Cup 2024: ఐర్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియాకు ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వేసిన ఒక ప్రశ్న దిమ్మతిరిగిపోయేలా ఉంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా బలం బలహీనతలపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ విశ్లేషించాడు. ఈ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌కి ముందు మెక్‌గ్రాత్ వేసిన ఒక ప్రశ్న.. టీమిండియా క్రికెట్ అభిమానులను కలవర పెడుతుంది. మెక్‌గ్రాత్ చెప్పింది నిజమే కదా.. టీమిండియాకు ఇది నిజంగానే పెద్ద మైనస్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇంతకీ మెక్‌గ్రాత్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.. టీమిండియాకు బౌలింగ్‌లో ప్రధాన బలం ఎవరంటే.. కాస్త క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వారు ఎవరైనా చెప్పే సమాధానం.. జస్ప్రీత్ బుమ్రా. ఈ స్పీడ్ గన్ టీమిండియాకు బౌలింగ్‌లో ప్రధానాస్త్రం. ఏ ఫార్మెట్ అయినా.. ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే సత్తా బుమ్రా సొంతం.
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో కూడా భారత జట్టు బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే.. మెక్‌గ్రాత్ విశ్లేషణ ప్రకారం భారత జట్టులో బుమ్రాపై నమ్మకం పెట్టుకోవచ్చు కానీ, మరి బుమ్రాకు సపోర్ట్‌గా ఉంటూ.. వికెట్లు తీసే బౌలర్ ఎవరంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ను కలవర పెడుతోంది. అతను చెప్పినట్లు.. బుమ్రాకు మద్దతుగా మరో ఎండ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే, ఇబ్బంది పెట్టే బౌలర్ ప్రస్తుతం టీమ్‌లో ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఎందుకు లేరు.. మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ రూపంలో క్వాలిటీ పేసర్లు ఉన్నారు కదా? అని కొంతమంది క్రికెట్ అభిమానుల చెప్పవచ్చు. కానీ, వారి ఫామ్‌ను బట్టి చూస్తూ.. నిజంగానే బుమ్రా ఇచ్చే ప్రెజర్‌తో మరో ఎండ్‌లో వికెట్లు తీస్తారా? అనే డౌట్ వస్తుంది. ఐపీఎల్ 2024 ఫస్ట్ హాఫ్‌లో సిరాజ్ దారుణంగా విఫలం అయ్యాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో పుంజుకుని రాణించిన అతని ఎకానమీ టీ20ల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక అర్షదీప్ సింగ్.. టీ20 వరల్డ్‌కప్ 2022లో షమీతో పాటు టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా ఉన్నా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా అర్షదీప్ సింగ్‌కు అడ్వాంటేజ్ ఉన్నా.. దాన్ని ఎంత వరకు ఉపయోగించుకుని.. బుమ్రాకు మంచి పార్ట్నర్‌గా నిలుస్తాడో అనుమానమే. మరి కొత్త బంతితో బుమ్రా తీసుకొచ్చే ఒత్తిడిని క్యాష్ చేసుకుంటూ.. టీమిండియాకు వికెట్లు అందించే బౌలర్ ఎవరనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘Bumrah good, but who takes wickets around him?’: McGrath’s striking question to Rohit, Dravid ahead of India vs Ireland in T20 World Cup 2024 #T20WorldCup2024 #teamindia pic.twitter.com/MPmz6A8rfq
— Sayyad Nag Pasha (@nag_pasha) June 5, 2024