మ్యాక్స్​వెల్ డబుల్ సెంచరీపై కొత్త రచ్చ! కపిల్ దేవ్ కన్నా గొప్ప అంటూ?

  • Author singhj Published - 09:55 AM, Wed - 8 November 23

క్రికెట్ దునియాను ఒకే ఒక ఇన్నింగ్స్​తో ఆశ్చర్యానికి గురిచేశాడు ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్​వెల్. ఆఫ్ఘాన్​పై అతను ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్​ను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

క్రికెట్ దునియాను ఒకే ఒక ఇన్నింగ్స్​తో ఆశ్చర్యానికి గురిచేశాడు ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్​వెల్. ఆఫ్ఘాన్​పై అతను ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్​ను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

  • Author singhj Published - 09:55 AM, Wed - 8 November 23

ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ తన రియల్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్ టీమ్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు మ్యాక్సీ. గెలిచే అవకాశం ఏమాత్రం లేని మ్యాచ్​లో ఏకంగా డబుల్ సెంచరీ చేసి కంగారూలకు సంచలన విజయాన్ని అందించాడు. 128 బంతుల్లోనే 201 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. దీన్ని బట్టే మ్యాక్సీ బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 292 పరుగుల ఛేదనలో ఆసీస్ 91 రన్స్​కే 7 వికెట్లు కోల్పోయింది. కంగారూ ఫ్యాన్సే కాదు ఆ టీమ్ ప్లేయర్లు కూడా ఆశలు వదులుకున్నారు.

ఆస్ట్రేలియా ఓటమి లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఈ టైమ్​లో మ్యాక్స్​వెల్ అద్భుతమే చేశాడు. ఒక దశలో తీవ్రంగా అలసిపోయిన అతను దాదాపు ఒంటికాలినే ఆసారాగా చేసుకొని చెలరేగిపోయాడు. ఒంటికాలితో పోరాడుతూ ఒంటిచేత్తో టీమ్​ను గెలిపించాడు. మ్యాక్సీ రికార్డ్ ఇన్నింగ్స్​తో ఆఫ్ఘాన్​ను ఓడించిన ఆసీస్.. వరల్డ్ కప్ సెమీస్​కు సగర్వంగా దూసుకెళ్లింది. అద్భుతమైన నాక్ ఆడిన మ్యాక్స్​వెల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్​ను తామెప్పుడూ చూడలేదని ఫ్యాన్స్ సహా సీనియర్ క్రికెటర్లు కూడా అంటున్నారు. అయితే మ్యాక్సీ ఇన్నింగ్స్​తో క్రికెట్ వర్గాల్లో ఇప్పుడో కొత్త చర్చకు తెరలేచింది.

మ్యాక్స్​వెల్ డబుల్ సెంచరీని 1983 వరల్డ్ కప్​లో జింబాబ్వేపై కపిల్ దేవ్ (175) ఇన్నింగ్స్​తో అందరూ పోలుస్తున్నారు. ఆసీస్ ఫ్యాన్స్ అయితే కపిల్ కంటే మ్యాక్సీ ఆడిన ఇన్నింగ్సే గొప్ప అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే భారత ఫ్యాన్స్ మాత్రం కపిల్ తర్వాతే ఎవరైనా అని.. ఆ ఇన్నింగ్స్ కిందకే ఇదని అంటున్నారు. అసలు 1983లో కపిల్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.. జింబాబ్వేతో మ్యాచ్. అప్పట్లో ఆ టీమ్ చాలా స్ట్రాంగ్​గా ఉండేది. కపిల్ డెవిల్స్​కు ఆ మ్యాచ్ ఎంతో కీలకం. ఒకరకంగా చెప్పాలంటే అది చావోరేవో మ్యాచ్. జింబాబ్వే చేతిలో ఓడితే ఇంటిముఖం పట్టాల్సిందే. ఆ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన ఇండియా కేవలం 17 రన్స్​కే 5 వికెట్లు కోల్పోయింది.

స్నానానికి వెళ్లిన కపిల్ మధ్యలోనే బయటకు వచ్చి హడావుడిగా తయారై బ్యాటింగ్​కు దిగాడు. ఈ మ్యాచ్​లో భారత్ పుంజుకొని భారీ స్కోరు చేస్తుందని ఎవరికీ నమ్మకాల్లేవు. కానీ కపిల్ దేవ్ మాత్రం.. లోన్ వోల్ఫ్ మాదిరిగా యోధుడై నిలబడ్డాడు. కళాత్మక షాట్లతో జింబాబ్వే బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఏకంగా 266 రన్స్ చేసింది. టీమ్ స్కోరులో దాదాపు 70 పర్సెంటేజీ కపిల్ చేసిందే. భీకరమైన జింబాబ్వే పేస్ అటాక్​ను ఎదుర్కొంటూ కపిల్ ఆడిన షాట్స్ గురించి స్టేడియంలో మ్యాచ్ చూసిన వాళ్లు గొప్పగా చెబుతారు. అయితే బీబీసీ సమ్మె కారణంగా ఆ ఇన్నింగ్స్ లైవ్ టెలికాస్ట్ కాలేదు. వరల్డ్ కప్ హిస్టరీలోనే కాదు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇన్నింగ్స్​లో టాప్​లో కపిల్ దేవ్ ఆడిన నాక్ ఉంటుందని క్రికెట్ పండితులు చెబుతుంటారు.

చావో రేవో పరిస్థితుల్లో అలాంటి ఇన్నింగ్స్ ఆడి భారత క్రికెట్​ను కొత్త శకం వైపు నడిపించాడు కపిల్. నిన్నటి మ్యాచ్​లో ఆఫ్ఘాన్​పై మ్యాక్స్​వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా గొప్పదే. ఏడు వికెట్లు కోల్పోయిన దశలో వచ్చి ఒంటిచేత్తో టీమ్​ను గెలిపించడం మామూలు విషయం కాదు. ఓటమి కోరల్లో నుంచి జట్టును బయటపడేసిన మ్యాక్సీ ఇన్నింగ్స్ కపిల్​ ఇన్నింగ్స్​కు ఏమాత్రం తీసిపోదు. అతడి కెరీర్​తో పాటు క్రికెట్ హిస్టరీలోనూ గొప్ప ఇన్నింగ్స్​లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. అయితే దీనిపై కొందరు నెటిజన్స్, ఆసీస్ ఫ్యాన్స్ పోలికలు తీసుకొస్తుండటమే బాధాకరమని చెప్పాలి. కపిల్ ఇన్నింగ్స్​ను గౌరవిస్తూనే, మ్యాక్స్​వెల్​ బ్యాటింగ్​ను మెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఇది గొప్ప, అది గొప్ప అంటూ అనవసర కంపారిజన్స్​ వద్దని క్రికెట్ లవర్స్ అంటున్నారు. మరి.. కపిల్ వర్సెస్ మ్యాక్స్​వెల్ అంటూ నెట్టింట రచ్చ జరగడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ కొట్టిన ఆ షాట్‌ను.. ‘షాట్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా గుర్తించిన ICC

Show comments