టీమిండియాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. తుపాన్ ఇన్నింగ్స్ తో తన జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. అయితే మ్యాక్సీ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం..?
టీమిండియాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. తుపాన్ ఇన్నింగ్స్ తో తన జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. అయితే మ్యాక్సీ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం..?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు గెలిచి సత్తా చాటింది. ఇక మూడో మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని భావించింది. కానీ.. టీమిండియా ఆశలపై నీళ్లు కుమ్మరించాడు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్. తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన మ్యాక్సీ.. మ్యాచ్ ను భారత చేతుల్లోంచి లాక్కున్నాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై చిన్నపాటి యుద్ధాన్నే ప్రకటించాడు. అయితే మ్యాక్స్ వెల్ ఇంతలా చెలరేగిపోవడానికి కారణం ఎవరో తెలుసా? శతక వీరుడు రుతురాజ్ గైక్వాడ్. అవును రుతురాజ్ పై కోపంతో రెచ్చిపోయిన మ్యాక్స్ వెల్ విధ్వంసం సృష్టించాడు.
మ్యాక్స్ వెల్.. 3వ టీ20లో టీమిండియాను ముంచిన సునామీ. భారత్ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లో అనూహ్యంగా చెలరేగిన మ్యాక్సీ.. భారత బౌలర్లను ఆఫ్ఘాన్ బౌలర్ల తీరు దంచికొట్టాడు. గుహవాటిలో మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే మ్యాక్సీ ఇంతలా చెలరేగడానికి కారణం రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు మ్యాక్స్ వెల్. క్రీజ్ లో ఉన్న రుతురాజ్ అప్పటికే 96 పరుగులతో మంచి ఊపుమీదున్నాడు. మ్యాక్సి వేసిన ఈ ఓవర్ తొలి బంతినే సిక్సర్ గా మలిచి తొలి ఇంటర్నేషనల్ టీ20 సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక ఈ ఓవర్లో విధ్వంసం సృష్టించిన గైక్వాడ్ 3 సిక్సులు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఒకే ఒక్క ఓవర్ వేసిన మ్యాక్స్ వెల్ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు.
కాగా.. ఇది మనసులో పెట్టుకున్నాడో ఏమో గానీ.. టీమిండియా బౌలర్లను ఊచకోత కోశాడు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్. ఏ బౌలర్ అన్నది చూడకుండా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రుతురాజ్ తన ఓవర్లో కొట్టిన 30 రన్స్ కు బదులుగా 104 రన్స్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఆసీస్ తన చివరి రెండు ఓవర్లలో ఏకంగా 43 రన్స్ పిండుకుంది. దీన్ని బట్టే అర్ధం అవుతోంది గ్లెన్ విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో. మరి గ్లెన్ మ్యాక్స్ సంచలన బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One of the great finishes ever in T20I History.
– Maxwell is the hero. 🔥🫡pic.twitter.com/NwkG2Vt6lW
— Johns. (@CricCrazyJohns) November 28, 2023