Glenn Maxwell: ఆట అసలే లేదు.. ఈ ఓవరాక్షన్ అవసరమా? మాక్సీ! వైరలవుతున్న వీడియో..

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ గుర్తుపెట్టుకుని మరీ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ గుర్తుపెట్టుకుని మరీ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

క్రికెట్ మ్యాచ్ ల్లో కవ్వింపులు, కౌంటర్లు సర్వసాధారణమైన విషయమే. అయితే అవి కొన్ని కొన్ని సార్లు శృతి మించితే ఘర్షణకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇక బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతుంటే.. బౌలర్ సహనం కోల్పోయి కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటాడు. ఇలాంటి ఘటనలు క్రికెట్ లో మనం బోలెడు చూశాం. అయితే కొందరు క్రికెటర్లు మాత్రం గుర్తు పెట్టుకుని మరీ తమను ఇన్ సల్ట్ చేసిన వారికి గుణపాఠం చెబుతూ ఉంటారు.  అయితే మాక్స్ వెల్ కూడా ఇలాగే చేయబోయాడు. కానీ అసలే ఆటలేదు.. దారుణమైన ఫామ్ లో ఉన్నావ్.. నీకు ఈ ఓవరాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 28)న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గుజరాత్ టీమ్ నిర్దేశించిన 201 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లో దంచికొట్టింది. విల్ జాక్స్(100) అజేయం శతకానిక తోడు విరాట్ కోహ్లీ(70*) పరుగులతో రాణించి.. జట్టుకు మెరుపు విజయాన్ని అందించారు. ఈ విషయాలు అన్నీ అందరికి తెలిసినవే. కానీ ఈ మ్యాచ్ కి సంబంధించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్ వెల్ డ్రస్సింగ్ రూమ్ నుంచి డగౌట్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ నుంచి అరుపులు ఎక్కువ కావడంతో.. వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సైలెంట్ అంటూ తన నోటికి వేలిని అడ్డుపెట్టుకుని చెప్పాడు. ఆ తర్వాత ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ అరవండి అని తను కూడా వారితో పాటుగా గొంతు కలిపాడు. అయితే మాక్సీ అలా అనడానికి కారణం వేరే ఉంది. గతేడాది ముగిసిన వరల్డ్ కప్ 2023 ఫైనల్ జరిగింది ఇదే నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ లోనే. అప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రేక్షకుల వైపు చూస్తూ.. సైలెన్స్ అంటూ తన నోటికి వేలిని అడ్డుపెట్టుకుని చూపించాడు. ఇప్పుడు ఇదే తరహాలో మాక్స్ వెల్ కూడా చేశాడు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో క్రికెట్ అభిమానులు అతడిపై గుర్రుగా ఉన్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు చేస్తే ఓ పద్దతి ఉంటుంది. కానీ నీలాంటి ఫామ్ లోనే ప్లేయర్లు చేస్తే బాగోదు, ఇంకోసారి ఇలాంటివి చేయకు, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Show comments