కీలకమైన నాలుగో టీ20 ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. మూడో టీ20 తర్వాత స్టార్ ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కీలకమైన నాలుగో టీ20 ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. మూడో టీ20 తర్వాత స్టార్ ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే జరిగిన మూడ్యూ మ్యాచ్ ల్లో 2 భారత్ గెలవగా, ఒక మ్యాచ్ లో కంగారూ జట్టు గెలిచి.. అద్భుతంగా సిరీస్ లో పునరాగమనం చేసింది. తాజాగా జరిగిన మూడో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్ 1)న రాయ్ పూర్ వేదికగా కీలకమైన నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి టీ20 కావడం గమనార్హం. నిర్ణయాత్మక మ్యాచ్ కు ముందు ఆసీస్ కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు వెళ్లినట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కీలకమైన నాలుగో టీ20 ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలినట్లు సమాచారం. గత మ్యాచ్ లో సెంచరీ చేసి తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించిన స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. టీమిండియాతో జరిగే మిగతా రెండు టీ20 మ్యాచ్ లకు అతడికి రెస్ట్ ఇచ్చింది టీమ్ మేనేజ్ మెంట్. మాక్స్ వెల్ తో పాటుగా.. స్టీవ్ స్మిత్, జోస్ ఇంగ్లీస్, ఆడమ్ జంపా, సీన్ అబ్బాట్, స్టోయినిస్ కూడా స్వదేశానికి వెళ్లిపోయారు. వరుసగా మ్యాచ్ లు ఉండటంతో.. వారికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ఆసీస్ మేనేజ్ మెంట్ భావించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవం చేసుకోవాలని టీమిండియా యంగ్ ప్లేయర్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్ సైతం మ్యాచ్ లో విజయం సాధించి.. సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇక ఈ గ్రౌండ్ లో జరిగిన ఏకైక వన్డేలో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం సాధించింది.