ఒక యుద్ధం చేసి.. ప్లే ఆఫ్స్‌కు వచ్చిన RCBని ఆ ఒక్కడు ముంచేశాడు!

Glenn Maxwell, RCB vs RR, IPL 2024: ఈ సీజన్‌లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన తర్వాత పుంజుకుని అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కానీ, కీలక టైమ్‌లో ఓ ఆటగాడిని నమ్మి ఆర్సీబీ దారుణంగా మోసపోయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Glenn Maxwell, RCB vs RR, IPL 2024: ఈ సీజన్‌లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన తర్వాత పుంజుకుని అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కానీ, కీలక టైమ్‌లో ఓ ఆటగాడిని నమ్మి ఆర్సీబీ దారుణంగా మోసపోయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ఒక యుద్ధం చేసి.. కొత్త చరిత్ర సృష్టించింది. సీజన్‌ ఆరంభంలోనే తొలి 8 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరిన చరిత్ర లేదు. అలాంటి.. ఆర్సీబీ ఆ చరిత్రను తిరగరాస్తూ.. 7 ఓటముల తర్వాత కూడా 6 వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ చేసిన పోరాట చూసి.. శత్రువులు కూడా ఆర్సీబీకి మద్దతు పలికారు. ఒక విధంగా చెప్పాలంటే.. 6 ఎలిమినేటర్లు ఆడిన తర్వాత ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరింది. అధికారిక ఎలిమినేటర్‌లో మాత్రం ఓటమి పాలై.. ఇప్పటి వరకు చేసిన పోరాటానికి అర్థం లేకుండా చేసుకుంది. అయితే.. ఆర్సీబీ ఓటములకు కారణం ఆ ఒక్కడే అంటూ క్రికెట్‌ అభిమానులతో పాటు, ఆర్సీబీ ఫ్యాన్స్‌ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఆర్సీబీ ప్రధానంగా విరాట్‌ కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ సీజన్‌ ఆరంభం నుంచి కోహ్లీ ఒక్కడే ఆర్సీబీ బ్యాటింగ్‌ భారాన్ని తన భుజాలపై మోశాడు. ఆ తర్వాత దినేష్‌ కార్తీక్‌, గ్రీన్‌, పాటిదార్‌, విల్‌ జాక్స్‌, డుప్లెసిస్‌ ఫామ్‌లోకి రావడంతో కోహ్లీకి వాళ్ల బలం కూడా తోడైంది. దీంతో వరుస విజయాలు సాధ్యమయ్యాయి. అయితే.. టీమ్‌లో ఉన్న మరో ఆటగాడు కూడా ఫామ్‌లోకి వచ్చి ఉంటే.. ఆర్సీబీ ఒక అరివీర భయంకరమైన జట్టుగా మారి ఉండేది. ఆ ఆటగాడే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. ఆర్సీబీలో కోహ్లీ తర్వాత అంతటి ఫాలోయింగ్‌ ఉన్న ప్లేయర్‌. నిలబడితే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సమర్థుడు. కానీ, ఈ సీజన్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. 10 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ చేసిన రన్స్‌ ఎన్నో తెలుసా? కేవలం 52. ఇది అతని ఫెల్యూర్‌కు పరాకాష్ట.

విల్‌ జాక్స్‌ రాణించడంతో మ్యాక్సీని కొన్ని మ్యాచ్‌లు పక్కనపెట్టారు. కానీ, జాక్స్‌ ఇంగ్లండ్‌కు వెళ్లిపోవడంతో తిరిగి మ్యాక్స్‌వెల్‌కు అవకాశం ఇచ్చింది ఆర్సీబీ. టీమ్‌లో అల్జారీ జోసెఫ్‌ లాంటి ప్లేయర్‌ ఉన్నా.. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌ డుప్లెసిస్‌, కోహ్లీ అతనిపై నమ్మకం ఉంచారు. కానీ, ఆ నమ్మకాన్ని మ్యాక్స్‌వెల్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ఎలిమినేటర్‌ లాంటి ఎంతో కీలక మ్యాచ్‌లో చాలా నిర్లక్ష్యంగా ఆడి తన వికెట్‌ను రాజస్థాన్‌కు సమర్పించుకున్నాడు. అప్పటికే మూడో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని ఆదుకోవాల్సి పోయి.. గోల్డెన్‌ డక్‌ అయి.. మరింత ఒత్తిడిలోకి నెట్టేశాడు. నమ్మి టీమ్‌లోకి తీసుకుని రెండో అవకాశం ఇస్తే.. మ్యాక్స్‌వెల్‌ ఇంత దారుణంగా ముంచేశాడు. అందుకే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్‌ అంతా మ్యాక్స్‌వెల్‌ను పిచ్చితిట్లు తిడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments