ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా సారథి రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 57 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ వైపు దూసుకెళ్తున్న హిట్ మ్యాన్ ను సింగిల్ హ్యాండ్ తో స్టన్నింగ్ క్యాచ్ పట్టి అవుట్ చేశాడు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్. కళ్లు చెదిరే ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో వార్నర్(56), మిచెల్ మార్ష్(96), స్టీవ్ స్మిత్(74), లబూషేన్(72) పరుగులతో రాణించారు. అనంతరం 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్-సుందర్ లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్(18) ను మాక్స్ వెల్ అవుట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ ఆసీస్ బౌరల్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలోనే 81 పరుగులు చేసి.. సెంచరీ వైపు దూసుకెళ్తున్న రోహిత్ ను అద్భుతమైన క్యాచ్ తో అవుట్ చేశాడు మాక్స్ వెల్. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేయడానికి వచ్చిన మాక్స్ వెల్.. చివరి బంతిని భారీ షాట్ కు ప్రయత్నించాడు రోహిత్.. ఆ బాల్ కాస్త స్పీడ్ గా మాక్స్ వెల్ వైపు దూసుకొచ్చింది. అయితే ఇది ఊహించని అతడు బాల్ వైపు చేతిని చాపాడు. అంతే బాల్ వచ్చి మాక్సీ చేతిలో పడింది. దీంతో ఒక్కసారిగా అతడు భయానికి గురైయ్యాడు. అతడి వెనకాల ఉన్న అంపైర్ సైతం భయంతో పక్కకిజరిగాడు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు రోహిత్. మరి మాక్స్ వెల్ స్టన్నింగ్ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RohitSharma#Maxwell bhai bhai bhai lap SE lapka.. 😂😂😂😂 pic.twitter.com/mrcvje3wWH
— DesiMeme (@Deep90517323) September 27, 2023