iDreamPost

ఆసీస్ తో మ్యాచ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ!

  • Author Soma Sekhar Published - 07:44 PM, Wed - 27 September 23
  • Author Soma Sekhar Published - 07:44 PM, Wed - 27 September 23
ఆసీస్ తో మ్యాచ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ!

రాజ్ కోట్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో 352 పరుగుల భారీ స్కోర్ చేసింది పర్యాటక జట్టు. జట్టులో టాప్ 4 బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగారు. వార్నర్(56), మార్ష్(96), స్టీవ్ స్మిత్(74), లబూషేన్(72) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాటర్ల ముందు తేలిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ధీటైన జవాబిస్తోంది. తొలి వికెట్ కు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి 74 పరుగులు జోడించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా హిట్ మ్యాన్ చరిత్రకెక్కాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా సారథి రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే? స్వదేశంలో అన్ని ఫార్మాట్స్ లో కలిపి అత్యధిక సిక్సర్లు(257)బాదిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ అయ్యేలోపే.. 5 సిక్సర్లు కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ ఆటగాడు అయిన మార్టిన్ గప్తిల్(256)పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు కొట్టాడు రోహిత్.

అదీకాక అన్ని ఫార్మాట్స్ లో కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డు(553) రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు టీమిండియా సారథి. కాగా.. ఈ రికార్డు దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడనే చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెంచరీ వైపు దూసుకెళ్తున్న రోహిత్ ను అద్బుతమైన క్యాచ్ తో మాక్స్ వెల్ బోల్తా కొట్టించాడు. దీంతో 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రోహిత్ అవుట్ అయ్యాడు. మరోవైపు క్రీజ్ లో విరాట్ కోహ్లీ (44), శ్రేయస్ అయ్యర్(2) బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 21 ఓవర్లలో 148 పరుగులు చేసింది భారత జట్టు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి