iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: కోహ్లీతో గొడవ గురించి స్పందించిన గంభీర్‌! కోహ్లీని అంత మాట అనేశాడు..

  • Published Dec 12, 2023 | 12:23 PM Updated Updated Dec 12, 2023 | 12:23 PM

ఐపీఎల్‌ 2023 సందర్భంగా కోహ్లీ-నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవకు కొనసాగింపుగా కోహ్లీ-గంభీర్‌ కూడా వాదించుకున్నారు. ఆ గొడవ గురించి తాజాగా గంభీర్‌ స్పందిస్తూ.. కోహ్లీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌ 2023 సందర్భంగా కోహ్లీ-నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవకు కొనసాగింపుగా కోహ్లీ-గంభీర్‌ కూడా వాదించుకున్నారు. ఆ గొడవ గురించి తాజాగా గంభీర్‌ స్పందిస్తూ.. కోహ్లీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

  • Published Dec 12, 2023 | 12:23 PMUpdated Dec 12, 2023 | 12:23 PM
Gautam Gambhir: కోహ్లీతో గొడవ గురించి స్పందించిన గంభీర్‌! కోహ్లీని అంత మాట అనేశాడు..

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్లలో సభ్యుడు. రెండు వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లోనూ టాప్‌ స్కోరర్‌. అందుకే అతన్ని భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో అభిమానిస్తారు. కానీ, నిత్యం ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు గంభీర్‌. ధోని గురించో, మరో క్రికెటర్‌ గురించో ఏదో ఒకటి అనేస్తూ.. హెడ్‌లైన్స్‌లో ఉంటాడు. తాజాగా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 2023 సందర్భంగా రాయల్‌ ఛాలెంజెర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో కోహ్లీ-నవీన్‌ ఉల్‌ హక్‌, కోహ్లీ-గంభీర్‌ మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే.

తొలుత ఆఫ్ఘనిస్థాన్‌ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌తో కోహ్లీకి వాగ్వాదం జరిగింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య ఏదో మాటామాట అవుతుంటే.. మధ్యలో గంభీర కలగజేసుకుని.. కోహ్లీతో గొడవకు దిగాడు. ఆ ఘర్షణ గురించి ఇప్పుడు స్పందించిన గంభీర్‌.. అసలు ఆ రోజు ఎందుకు కోహ్లీతో గొడవకు దిగాల్సి వచ్చిందో వెల్లడించాడు. గంభీర్‌ మాట్లాడుతూ..  ఆ స్థానంలో నవీన్‌ ఉల్‌ హక్‌ అనే కాదు.. ఎవరున్నా తాను రియాక్ట్‌ అయ్యేవాడినని, తన టీమ్‌ ప్లేయర్‌ను డిఫెండ్‌ చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని. అందుకే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు. కోహ్లీని ఉద్దేశిస్తూ.. సోషల్‌ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉందని ఎవరిపైకి వారిపైకి వెళ్తా అంటూ చూస్తూ ఊరుకోను అంటూ పేర్కొన్నాడు.

తన టీమ్‌ ప్లేయర్‌పై ఎవరో గొడవకి దిగితే.. తాను డిఫెండ్‌ చేసుకోలేకపోతే.. ఇక తాను ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి ఏం లాభమంటూ పేర్కొన్నాడు గంభీర్‌. ఈ వ్యాఖ్యల్లో సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ను చూసుకుని కోహ్లీ రెచ్చిపోతున్నాడని గంభీర్‌ ఉద్దేశంగా భావించవచ్చు. కాగా, ఆ గొడవ తర్వాత.. నవీన్‌ ఉల్‌ హక్‌ను ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా కోహ్లీ ఆ గొడవకు పుల్‌స్టాప్‌ పెట్టాడు. అయినా కూడా గంభీర్‌ మళ్లీ ఆ గొడవ గురించి మాట్లాడి.. అనవసరంగా పాత గొడవను కెలుకుతున్నాడంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కోహ్లీ గురించి గంభీర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.