SNP
Gautam Gambhir, Mohammad Siraj, IND vs SL: టీమిండియాలోకి ఓ టాలెంటెడ్ యంగ్ పేసర్‌ను తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడు. అది కూడా స్టార్ బౌలర్ సిరాజ్‌ను పక్కనపెట్టి మరీ అతన్ని తేవాలని చూస్తున్నాడు. మరి ఆ స్పెషల్ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir, Mohammad Siraj, IND vs SL: టీమిండియాలోకి ఓ టాలెంటెడ్ యంగ్ పేసర్‌ను తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడు. అది కూడా స్టార్ బౌలర్ సిరాజ్‌ను పక్కనపెట్టి మరీ అతన్ని తేవాలని చూస్తున్నాడు. మరి ఆ స్పెషల్ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా హెడ్ కోచ్‌గా ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఫీల్డ్‌లోకి దిగకముందే గౌతమ్ గంభీర్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో ప్రారంభం అయ్యే టీ20 సిరీస్‌తో గంభీర్ హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకోనున్నాడు. శ్రీలంకతో మూడు టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌ల కోసం నేడో రేపో జట్లను ప్రకటించనున్నారు సెలెక్టర్లు. అయితే.. ఈ ఎంపికలో కూడా గంభీర్ తన ముద్ర చూపించాలని భావిస్తున్నాడు. అందుకోసం ఓ టాలెంటెడ్ బౌలర్‌ను తిరిగిర టీమిండియాలోకి తేవాలని భావిస్తున్నాడు.
దాదాపు మూడేళ్ల నుంచి టీమిండియాకు దూరంగా ఉన్న ఓ యంగ్ బౌలర్‌ను తిరిగి తీసుకొచ్చే ప్లాన్‌లో గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం అంటే 2021లో శ్రీలంకతోనే చివరి సారి ఆడిన యువ బౌలర్ నవ్‌దీప్ సైనిని మళ్లీ టీమిండియాలోకి తీసుకోవాలని సెలెక్టర్లు గంభీర్ సూచన చేసినట్లు సమాచారం. జట్టు స్పీడ్ బౌలింగ్ స్ట్రెంత్ పెంచేందుకే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. సైనిని టీ20 జట్టులోకి తీసుకుంటే.. మొహమ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టి.. కేవలం వన్డేలకు పరిమితం చేసే అవకాశం ఉంది. బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రస్తుతం టీ20ల్లో బెస్ట్ బౌలర్లుగా ఉన్నారు. షమీ రీఎంట్రీ ఇస్తే అతన్ని కూడా కదిపే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది సిరాజ్ మాత్రమే.
వన్డేల్లో సిరాజ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ, టీ20ల్లో మాత్రం సిరాజ్‌కు అంత గొప్ప స్టాట్స్ లేవు. పైగా సిరాజ్‌కు సైని మంచి రీప్లేస్‌మెంట్ అవుతాడు. ఇద్దరు రైట్‌ఆర్మ్ పేసర్లే, వేగంగా కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే.. సిరాజ్ కంటే టీ20లకు సైని అయితే బెటర్ అని గంభీర్ భావిస్తున్న నేపథ్యంలోనే అతనికి మూడేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియా తరఫున 2 టెస్టులో 4 వికెట్లు, 8 వన్డేల్లో 6 వికెట్లు, 11 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు సైని. హర్యానాకు చెందిన ఈ బౌలర్ ఐపీఎల్‌లో ఢిల్లీకి ఆడాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతనికి ఐపీఎల్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ 2023, 2022లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయినా కూడా గంభీర్ అతనిపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి సైనిని తిరిగి టీమ్‌లోకి తీసుకురావాలనే గంభీర్ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir’s coach Sanjay Sir Said “Gautam could select players like Kuldeep Yadav and Navdeep Saini. They are his products. He did the same with Sunil Narine in IPL 2024. His observation and cricketing acumen are always outstanding,” (PTI)
— Vipin Tiwari (@Vipintiwari952) July 18, 2024