P Venkatesh
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ రోహిత్ కు మద్దతుగా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్ లో హిట్ మ్యాన్ ఔటవడాన్ని పలువురు తప్పుబట్టారు. దీనిపై స్పందించిన గంభీర్ తప్పు రోహిత్ ది కాదు. ఈ దేశానిదే అని ఆయన అన్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ రోహిత్ కు మద్దతుగా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్ లో హిట్ మ్యాన్ ఔటవడాన్ని పలువురు తప్పుబట్టారు. దీనిపై స్పందించిన గంభీర్ తప్పు రోహిత్ ది కాదు. ఈ దేశానిదే అని ఆయన అన్నారు.
P Venkatesh
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తుది పోరులో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో వరల్డ్ కప్ ఆరంభం నుంచి వరుస విజయాలతో అదరగొట్టిన భారత్ కప్ గెలవకపోవడంతో కోట్లాది మంది భారతీయులు నిరాశకు గురయ్యారు. కాగా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా సారథి జట్టు గెలుపు కోసం చేసిన కృషి మరువలేనిది. ప్రపంచకప్ ఫైనల్ లో దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ ను చేజార్చుకున్నారు. దీనిపై పలువురు రోహిత్ ను తప్పుబట్టారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ గౌతం గంభీర్ హిట్ మ్యాన్ కు మద్దతుగా నిలిచారు. రోహిత్ ఏ ఒక్క మ్యాచ్ లో కూడా వ్యక్తిగత మైలురాయి కోసం బ్యాటింగ్ చేయలేదు. ఆచీతూచి బ్యాటింగ్ చేసినట్లైతే మూడు, నాలుగు సెంచరీలు అలవోకగా బాదేవాడని గంభీర్ అన్నారు. రోహిత్ శర్మ జట్టుకోసమే భారీ షాట్లు ఆడాడని ఆయన చెప్పారు.
వ్యక్తిగత గణాంకాలతో జట్టుకు చాలా నష్టం జరుగుతోందని, ఈ సమస్య ఒక్క టీమిండియాలోనే కాదు, ఉపఖండంలోని అన్ని టీముల్లో ఉందని గంభీర్ వెల్లడించారు. గణాంకాలను దృష్టిలో పెట్టుకుని ఆడితే ఆశించిన ఫలితాలు రావని, భారత్ లోని అన్ని జట్లు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని గంభీర్ సూచించారు. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. వన్డేల్లో సెంచరీలు కొట్టడం కష్టమేమీ కాదు. కానీ సెంచరీలకు అర్థం లేదు. జట్టుకోసం ఆడడం మఖ్యం. హిట్ మ్యాన్ అదే చేశారు. జట్టుకు మంచి శుభారంబాన్ని అందించేందుకు ఎలాంటి బౌలింగ్ నైనా ఎదుర్కొని భారీ షాట్స్ ఆడారు. ఓపెనర్ గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఒక వేళ నిదానంగా ఆడుంటే వరల్డ్ కప్ లో నాలుగు సెంచరీలు చేసేవారని గంభీర్ అన్నారు.
విధ్వంసకరమైన బ్యాటింగ్ తో కూడా టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా రోహిత్ నిలిచారని ఆయన అన్నారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ 11 మ్యాచుల్లో 597 పరుగులు సాధించారు. వీటిలో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే ఉండగా, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డీ కాక్ నాలుగు సెంచరీలు బాదాడు. కోహ్లీ, రచిన్ రవీంద్ర చెరో మూడు శతకాలు సాధించారు. సెంచరీలు చేయడమే ముఖ్యం కాదు.. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన పరుగులు కూడా ఎంతో విలువైనవే. అలా అని సెంచరీలు చేసిన వారిని ఆకాశానికి ఎత్తడం, తక్కువ పరుగులు చేసిన వారిని గుర్తించకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ విషయంలో దేశం మారాలి అని గంభీర్ చెప్పారు.