SNP
గౌతమ్ గంభీర్.. ఇండియన్ క్రికెట్‌లో మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్. ఆటతోనే కాదు మాటతో కూడా ప్రత్యర్థులకు బదులివ్వగల గడుసరి. అయితే.. తాజాగా గంభీర్ ఆడిన ఓ ఇన్నింగ్స్ చూస్తే.. మళ్లీ టీమిండియాలోకి తీసుకోవాలనే ఉంది. ఇంతకీ ఆ ఇన్నింగ్స్ ఎక్కడ ఆడాడు.. ఎలా ఆడాడో ఇప్పుడు తెలుసుకుందాం..
గౌతమ్ గంభీర్.. ఇండియన్ క్రికెట్‌లో మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్. ఆటతోనే కాదు మాటతో కూడా ప్రత్యర్థులకు బదులివ్వగల గడుసరి. అయితే.. తాజాగా గంభీర్ ఆడిన ఓ ఇన్నింగ్స్ చూస్తే.. మళ్లీ టీమిండియాలోకి తీసుకోవాలనే ఉంది. ఇంతకీ ఆ ఇన్నింగ్స్ ఎక్కడ ఆడాడు.. ఎలా ఆడాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
గౌతమ్ గంభీర్.. ఇండియన్ క్రికెట్‌లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. క్రికెట్‌ని ఒక యుద్ధంలా భావించి, దేశం కోసం ప్రాణం పెట్టే అరుదైన క్రికెటర్స్ లో గంభీర్ ముందు వరుసలో ఉంటాడు. ఆటగాడిగా ఉన్నప్పుడు గంభీర్ అప్రోచ్ ఎంత సీరియస్ గా ఉండేదో అందరికీ తెలుసు. ప్రత్యర్థులను కవ్వించినా, ధోని స్లో బ్యాటింగ్ ని విమర్శించినా.. అది గంభీర్ కే చెల్లుబాటు అయ్యింది. ఆట పట్ల ఇంత సిన్సియర్‌గా ఉంటాడు కాబట్టే.. రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ లో హయ్యెస్ట్ రన్స్ చేసి.. దేశానికి రెండు వరల్డ్ కప్స్ అందించాడు గౌతీ. అయితే.. ఇప్పుడు ఇంటెర్నేషనల్ క్రికెట్ కి ఎప్పుడో గుడ్ బై చెప్పిన గంభీర్.. ఇంకా తన ఆటలో పదును తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. 2023 లెజెండ్స్ లీగ్ తాజాగా ఇందుకు వేదిక అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
లెజండ్స్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య.. హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్యాపిటల్స్ లో టీమ్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. 30 బంతులు ఆడిన గౌతీ.. 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 51 పరుగులు సాధించడం విశేషం. గంభీర్ ఇన్నింగ్స్ మొత్తం చాలా ప్రశాంతంగా కనిపిస్తూ.., అద్భుతమైన షాట్స్ తో బౌండరీలు సాధిస్తూ, స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఇక గంభీర్ తోడు.., కిర్క్ ఎడ్వర్డ్స్ (26), కెవిన్ పీటర్సన్ (26), రికార్డో పావెల్ (28), బెన్ డంక్ (30), చిప్లి (35) తమ బాధ్యతని నిర్వర్తించడంతో క్యాపిటల్స్ కు భారీ స్కోర్ సాధ్యమైంది. ఇక గుజరాత్ బౌలర్లలో ఎమ్రిట్, రజత్ భాటియా శ్రీశాంత్ పర్వాలేదు అనిపించారు.
భారీ టార్గెట్ ఛేదించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్.. చివరి మూడు ఓవర్లులో తడబడి చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆ జట్టులో జాక్ కల్లిస్ (11), రిచర్డ్ లెవి (11), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (13) దారుణంగా విఫలమైనా.. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్ విజయంపై ఆశలు లేపారు. గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57: 7 ఫోర్లు, 2 సిక్స) చెలరేగడం విశేషం. అయితే.. చివరి మూడు ఓవర్లలో 18 పరుగులు చేయలేక.. ఒత్తిడికి లోనై గుజరాత్ జెయింట్స్ గెలుపు ముంగిట చితకల పడింది. ఇక్కడ కూడా కెప్టెన్ గా గంభీర్ అద్భుతమైన వ్యూహాలు రచించడం విశేషం. దీంతో.. ఒత్తిడిలో రాణించడం ఎలాగో తెలిసిన గంభీర్ లాంటి ఆటగాళ్లు ఇప్పుడు టీమ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంకొంత మంది అయితే.. అసలు గంభీర్ ని టీ-20 వరల్డ్ కప్ లో ఆడించినా తప్పు లేదంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వయసులో కూడా గొప్పగా ఆడుతున్న గంభీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir on the charge in the LLC. pic.twitter.com/CJaliFR27O
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 6, 2023