iDreamPost

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ పదవి.. BCCI ముందు 5 కండిషన్లు పెట్టిన గంభీర్!

బీసీసీఐ ముందు 5 కండిషన్లు పెట్టాడట గంభీర్. ఈ కండీషన్లకు బీసీసీఐ ఓకే చెబుతేనే తాను హెడ్ కోచ్ గా బాధత్యలు స్వీకరిస్తానని గంభీర్ చెప్పుకొచ్చాడట. ప్రస్తుతం ఈ న్యూస్ క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ గంభీర్ పెట్టిన ఆ 5 కండీషన్లు ఏంటీ?

బీసీసీఐ ముందు 5 కండిషన్లు పెట్టాడట గంభీర్. ఈ కండీషన్లకు బీసీసీఐ ఓకే చెబుతేనే తాను హెడ్ కోచ్ గా బాధత్యలు స్వీకరిస్తానని గంభీర్ చెప్పుకొచ్చాడట. ప్రస్తుతం ఈ న్యూస్ క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ గంభీర్ పెట్టిన ఆ 5 కండీషన్లు ఏంటీ?

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ పదవి.. BCCI ముందు 5 కండిషన్లు పెట్టిన గంభీర్!

టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎవరు? గత కొంత కాలంగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తోంది ప్రపంచ క్రికెట్. అయితే భారత నూతన కోచ్ గా టీమిండియా మాజీ ప్లేయర్, వరల్డ్ కప్ విన్నింగ్ హీరో గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. కానీ బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇక ఇప్పటికే హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నాడు గంభీర్. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చి.. సంచలనంగా మారింది. అదేంటంటే? బీసీసీఐ ముందు 5 కండిషన్లు పెట్టాడట గంభీర్. ఈ కండీషన్లకు బీసీసీఐ ఓకే చెబుతేనే తాను హెడ్ కోచ్ గా బాధత్యలు స్వీకరిస్తానని గంభీర్ చెప్పుకొచ్చాడట. మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో ముందున్నాడు భారత మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. ఇప్పటికే ఈ పదవి కోసం ఇంటర్వ్యూ సైతం పూర్తి చేసుకున్నాడు గంభీర్. ఇక ఇతడితో పాటుగా డబ్ల్యూవీ రామన్ సైతం పోటీపడుతున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం గంభీర్ వైపే మెుగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో తాను హెడ్ కోచ్ పదవి చేపట్టాలంటే.. తాను పెట్టిన 5 కండీషన్లను అంగీకరించాలని బీసీసీఐకి గంభీర్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ బీసీసీఐకి గంభీర్ పెట్టిన ఆ 5 కండీషన్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం.

BCCIకి గంభీర్ 5 కండిషన్లు!

  • బోర్డు లేదా బయటి వ్యక్తుల జోక్యాన్ని సంహించేదే లేదు. క్రికెట్ కు సంబంధించిన విషయంలో ఎవరి జోక్యం ఉండకూడదు.
  • హెల్పింగ్ స్టాఫ్ ను ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ ను నియమించే క్రమంలో ఇతరుల జోక్యం ఉండకూడదు.
  • వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో టీమ్ విఫలం అయితే.. జట్టులో నుంచి సీనియర్లను తప్పించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.
  • టెస్ట్ ఫార్మాట్ కు ప్రత్యేకంగా టీమ్ ను రెడీ చేసుకోవాలి. అందుకోసం భవిష్యత్ లో ఆటగాళ్లను ఎంపిక చేయాలి.
  • వన్డే ప్రపంచ కప్ 2027కు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. రోడ్ మ్యాప్ ను రెడీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. జట్టు ఎంపికలో స్వేచ్ఛ ఉండాలి.

ఈ 5 కండీషన్లను గంభీర్ బీసీసీఐ ముందట ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో మూడో పాయింట్ కీలకం కానుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గడంలో టీమిండియా గనక విఫలం అయితే.. రోహిత్, కోహ్లీ, జడేజా, షమీ లాంటి సీనియర్లకు ఇదే చివరి అవకాశం కానుంది. వారిని జట్టు నుంచి తీసేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనేది ఈ కండీషన్. కాగా.. ఇప్పటికే బీసీసీఐలో ఎన్నో రాజకీయాలు జరుగుతాయని చాలా మంది మాజీ క్రికెటర్లు పలు సందర్భాల్లో చెప్పిన విషయం మనకు తెలియనిది కాదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే రాహుల్ ద్రవిడ్ తన హెడ్ కోచ్ పదవి నుంచి దిగిపోతాడు. జూలై నుంచి కొత్త కోచ్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ బీసీసీఐకి 5 కండీషన్లు పెట్టాడన్న వార్తలు వైరల్ కావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి