టీమిండియాలో నేను చూసిన సెల్ఫ్‌లెస్‌ క్రికెటర్‌ అతనొక్కడే: గంభీర్‌

టీమిండియాలో నేను చూసిన సెల్ఫ్‌లెస్‌ క్రికెటర్‌ అతనొక్కడే: గంభీర్‌

Rahul Dravid, Gautam Gambhir: టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాను చూసిన నిస్వార్థ భారత క్రికెటర్‌ అతనేనంటూ వెల్లడించాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Rahul Dravid, Gautam Gambhir: టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాను చూసిన నిస్వార్థ భారత క్రికెటర్‌ అతనేనంటూ వెల్లడించాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా కొత్త హెడ్‌ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ తన తొలి పరీక్షకు సిద్ధం అవుతున్నాడు. హెడ్‌ కోచ్‌గా అపాయింట్‌ అయి.. ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత.. ఫస్ట్‌ సిరీస్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా భారత్‌ హెడ్‌ కోచ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. అతని కోచింగ్‌లోని టీమిండియా శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. నేటి(శనివారం) నుంచి ఆ సిరీస్‌ ప్రారంభం అవుతోంది. తొలి టీ20 పల్లెకలె వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. ఛాంపియన్‌గా నిలబెట్టిన తర్వాత ద్రవిడ్‌ టీమిండియాను గంభీర్‌ చేతుల్లో పెట్టాడు. ఈ సందర్భంగా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ తొలి మ్యాచ్‌కి ముందు ద్రవిడ్‌ ఒక స్పెషల్‌ మెసేజ్‌ను గంభీర్‌కి పంపించాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లాలంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. గంభీర్‌ కోసం ఒక వాయిస్‌ రియార్డ్‌ మెసేజ్‌ పంపించాడు ద్రవిడ్‌. ఆ మెసేజ్‌ విన్న తర్వాత గంభీర్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు.

ద్రవిడ్‌తో కలిసి టీమిండియాకు ఆడిన గంభీర్‌.. ఆ సమయంలో ద్రవిడ్‌ను ఒక నిస్వార్థ క్రికెటర్‌గా చూశానంటూ తెలిపాడు. తాను చూసిన వారిలో ద్రవిడ్‌ ఒక్కడే సెల్ఫ్‌లెస్‌ క్రికెటర్‌ అని, టీమిండియాకు ఏం కావాలంటే అది చేశాడంటూ ద్రవిడ్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. సాధారణంగా తాను భావోద్వేగానికి గురయ్యే వ్యక్తిని కానని, కానీ, ద్రవిడ్‌ మెసేజ్‌తో తాను ఎమోషనల్‌ అవుతున్నట్లు పేర్కొన్నాడు. టీమిండియాను ఒక అద్భుతమైన టీమ్‌గా నిలబెట్టి.. ద్రవిడ్‌ను గర్వపడేలా చేస్తానంటూ గంభీర్‌ వెల్లడించాడు. మరి ద్రవిడ్‌ను నిస్వార్థ క్రికెటర్‌ అంటూ గంభీర్‌ కితాబివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments