Somesekhar
మాకు డబ్బులు ఎక్కువై అంత భారీ ధరపెట్టి మిచెల్ స్టార్క్ ను కొనలేదని, మా ప్లాన్స్ మాకున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మాకు డబ్బులు ఎక్కువై అంత భారీ ధరపెట్టి మిచెల్ స్టార్క్ ను కొనలేదని, మా ప్లాన్స్ మాకున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2024 వేలంలో టోర్నీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు ధర పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం స్టార్క్ ను రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ హోరాహోరిగా పోటీపడ్డాయి. కానీ చివరికి అతడికిని నైట్ రైడర్స్ యాజమాన్యం సోంతం చేసుకుంది. దీంతో అందరూ షాక్ కు గురైయ్యారు. స్టార్క్ కు అంత ధర అవసరమా? అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఇక ఈ కామెంట్స్ పై తాజాగా స్పందించాడు కేకేఆర్ మెంటర్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్. మాకు డబ్బులు ఎక్కువై అతడిని కొనలేదని, మా ప్లాన్స్ మాకున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయి హిస్టరీ క్రియేట్ చేశాడు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కైయ్యారు. అతడికి అంత ధర అవసరం కూడా లేదని కొందరు కామెంట్స్ సైతం చేశారు, చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా స్పందించాడు కేకేఆర్ మెంటర్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్. స్టార్క్ కు ఎందుకు అంత ధర పెట్టామో అసలు కారణం చెప్పుకొచ్చాడు.
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ..”మిచెల్ స్టార్క్ X-ఫ్యాక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా అతడు కొత్త బాల్ తో ఎలాంటి మ్యాజిక్ చేయగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించగలడు. ఇవన్నీ ఒకెత్తు అయితే కేకేఆర్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తూ.. తన అనుభవాన్ని యువ బౌలర్లకు పంచగలడు. మేం కేవలం బౌలింగ్ కోసమే అతడిని కొనలేదు. స్టార్క్ లో ఉన్న ఈ నైపుణ్యాల కోసమే కొనుగోలు చేశాం. కేకేఆర్ ఫస్ట్ నుంచి బలమైన బౌలింగ్ దళం ఉండాలని భావించేది. ప్రస్తుతం మా బౌలింగ్ పటిష్టంగా ఉంది. జట్టులో ముజీబ్ రెహ్మాన్, సునీల్ నరైన్, అట్కిన్సన్, సకారియా, హర్షిత్ రానా, సుయాశ్ శర్మ ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. ఇక కేకేఆర్ ఓ టీమ్ మాత్రమే కాదని, అదొక ఎమోషన్ అని గంభీర్ పేర్కొన్నాడు. 2012, 2014 సీజన్ ను రిపీట్ చేస్తామని అతడు తెలిపాడు. ఆ రెండు సీజన్లలో కేకేఆర్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరి స్టార్క్ కొనుగోలుపై గంభీర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir’s smile says it All.
The moment when the history created in IPL. Starc gets 24.75 Crore most expensive.#Starc #PAKvsNZ #PAKvsAUS #IPL2024Auction #iplauction2024 #IPL
pic.twitter.com/Fcv6jVMgzD— Muhammad Ibrar (@iMIbrarr) December 19, 2023