Nidhan
భారత లెజెండ్ గౌతం గంభీర్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నానుతున్నాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా సక్సెస్ అవడం, టీమిండియాకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడంతో క్రికెట్ వర్గాల్లో అతడి గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
భారత లెజెండ్ గౌతం గంభీర్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నానుతున్నాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా సక్సెస్ అవడం, టీమిండియాకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడంతో క్రికెట్ వర్గాల్లో అతడి గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
Nidhan
భారత లెజెండ్ గౌతం గంభీర్ ఈ మధ్య బాగా వార్తల్లో నానుతున్నాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా సక్సెస్ అవడం, టీమిండియాకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవడంతో క్రికెట్ వర్గాల్లో అతడి గురించి ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మెన్ ఇన్ బ్లూ ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో అతడు త్వరలో బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. పొట్టి కప్పు పూర్తయిన వెంటనే అతడు టీమ్‌ను వీడనున్నాడు. దీంతో కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టిన భారత క్రికెట్ బోర్డు.. రీసెంట్గా ఆ పోస్ట్ కోసం పలువుర్ని ఇంటర్వ్యూ చేసింది. అందులో గంభీర్ కూడా ఉన్నాడు. గౌతీ ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. త్వరలో కోచ్‌గా అతడి పేరును అధికారికంగా ప్రకటించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో గంభీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్, తన కెరీర్ తదితర విషయాలపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్ పదవి గురించి ఇప్పుడు సమాధానం చెప్పడం కష్టమన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్‌తో అద్భుతమైన ప్రయాణాన్ని ముగించుకొని హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. ఇప్పుడు భారత కోచింగ్ గురించి అంతగా ఆలోచించడం లేదంటూ జవాబు దాటవేశాడు. ఈ సందర్భంగా వన్డే ప్రపంచ కప్-2011 గురించి కూడా గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టోర్నీ ఫైనల్లో ఎంఎస్ ధోనీకి ఆ పనిని వదిలేసి తప్పు చేశానని చెప్పాడు. ‘వన్డే ప్రపంచ కప్-2011 ఫైనల్ మ్యాచ్‌ను నేను ముగించాల్సింది. టీమ్‌ను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాదే. మ్యాచ్‌ను ఫినిష్ చేసే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వకుండా నేనే ఆ పని పూర్తి చేయాల్సింది. ఒకవేళ కాలాన్ని గిర్రున తిప్పే ఛాన్స్ వస్తే నేను వెనక్కి వెళ్లి ఆ వర్క్ పూర్తి చేసొస్తా. ఆ మ్యాచ్‌లో లాస్ట్ రన్‌ను కంప్లీట్ చేసి వచ్చేస్తా. ఆ మ్యాచ్‌లో నేను ఎన్ని పరుగులు చేశాననేది కాదు.. ఆఖరి పరుగు పూర్తి చేశానా? లేదా? అనేదే ముఖ్యం’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
వన్డే వరల్డ్ కప్-2011 ఫైనల్లో భారత్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో గంభీర్ 97 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 91 పరుగులు చేయడం, ఆఖర్లో విన్నింగ్ సిక్స్ కొట్టడంతో ఎక్కువ క్రెడిట్ ధోని ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా పైకామెంట్స్ చేయడం గమనార్హం. ఇక, కోచింగ్ గురించి మాట్లాడుతూ.. వ్యక్తుల కంటే టీమ్‌ను ముందుంచాలనే ఐడియాతోనే తాను ముందుకు వెళ్తానని పేర్కొన్నాడు గౌతీ. ఇలాంటి ఆలోచనతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా రిజల్ట్ అనుకూలంగా వస్తుందన్నాడు. కోచ్‌గా జట్టులోని 11 మంది ఆటగాళ్లను ఒకేలా చూడాలన్నదే తన పాలసీ అని చెప్పాడు. అందరికీ సమానంగా రెస్పెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం మంచిదన్నాడు. అప్పుడే అద్భుత విజయాలు అందుకోగలమని గంభీర్ వివరించాడు. మరి.. వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీకి ఆ పని వదిలేసి తప్పు చేశానంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Gautam Gambhir ” I wish I had finished the 2011 World Cup final,It was my job to finish the game,rather than leaving someone to finish the game.If I had to turn back the clock,I would go back and score the last run,irrespective of how many runs I scored.”pic.twitter.com/BV615MeCRU
— Sujeet Suman (@sujeetsuman1991) June 22, 2024