KL రాహుల్‌ లాంటి ప్లేయర్‌.. ప్రపంచంలో ఏ టీమ్‌లోనైనా ఉన్నాడా: గంభీర్‌

Gautam Gambhir, KL Rahul, BGT 2024, Cricket News: టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఉద్దేశించి భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, KL Rahul, BGT 2024, Cricket News: టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఉద్దేశించి భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా ఐదు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 22 నుంచి భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య బీజీటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం. వచ్చే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఆడాలంటే కచ్చితంగా ఈ సిరీస్‌ను 4-0తో గెలిచి తీరాలి. కానీ, అది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే.. సిరీస్‌ జరగబోయేది ఆస్ట్రేలియాలో. అక్కడ టెస్ట్‌ సిరీస్‌ 4-0తో గెలవడం అంటే అదో చరిత్ర అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు టీమిండియాకు ఆస్ట్రేలియాలో 2-1తో మాత్రమే టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన రికార్డ్‌ ఉంది. అందుకే ఈ సారి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి టెస్ట్‌కు దూరం అవుతున్నాడని సమాచారం.

తన వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు అందబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే.. అతని ప్లేస్‌లో కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడిస్తామని హెడ్‌ కోచ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. అయితే.. కేఎల్‌ రాహుల్‌ అంత మంచి ఫామ్‌లో లేడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన రాహుల్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యాడు. దాంతో అతన్ని మిగిలిన రెండు టెస్టుల్లో డ్రాప్‌ చేశారు. అయితే.. పట్టుదలతో టీమిండియా కంటే ముందే.. ఆస్ట్రేలియా వచ్చిన కేఎల్‌ రాహుల్‌, ఇండియా-ఏ తరఫున ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌ ఆడాడు. ఎలాగైన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని ప్రయత్నించాడు కానీ, సక్సెస్‌ కాలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్‌ విఫలం అయ్యాడు. అయినా కూడా అతన్ని రోహిత్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఆడిస్తామని గంభీర్‌ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే గంభీర్‌, రాహుల్‌ను వెనకేసుకొచ్చాడు. కేఎల్‌ రాహుల్‌ ఏ ప్లేస్‌లోనైనా బ్యాటింగ్‌ చేయగలడు, వన్‌డౌన్‌లో ఆడించినా ఆడతాడు, 6వ స్థానంలో బ్యాటింగ్‌ చేయించినా చేస్తాడు, ఓపెనర్‌గా కూడా ఆడమంటే ఆడతాడు. పైగా వన్టేల్లో అతను కీపింగ్‌ కూడా చేస్తున్నాడు. ఇలా ప్లేస్‌లోనైనా ఆడే కేఎల్‌ రాహుల్‌ లాంటి టాలెంటెడ్‌ ప్లేయర్‌ ప్రపంచంలోని మరే టీమ్‌లోనైనా ఉన్నాడా? అంటూ గంభీర్‌ ప్రశ్నించాడు. నిజానికి గంభీర్‌ చెప్పింది కూడా వాస్తవమే.. పాపం కేఎల్‌ రాహుల్‌ ఏ ప్లేస్‌లో ఆడించినా ఆడతాడు. నేను కేవలం ఓపెనర్‌గానే ఆడతాను, మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌ చేస్తాను, వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మాత్రమే ఆడతాను అని ఏ నాడు టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో కరాఘండిగా చెప్పలేదు. అందుకే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా సార్లు కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పులు చేసింది.

అయితే.. వేరే ప్లేయర్లకు ప్లేస్‌ ఇచ్చేందుకు కొన్ని సార్లు, టీమ్‌ కోసం కొన్ని సార్లు రాహుల్‌ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. కానీ, తొలి సారి.. తన కోసమే ఓపెనర్‌గా ఆడుతున్నాడు. అందుకు రోహిత్‌ శర్మ గైర్హాజరీ కూడా కలిసివస్తోంది. అంటే ఇప్పటి వరకు త్యాగాలు చేసిన రాహుల్‌.. ఇప్పుడ తన కెరీర్‌ కోసం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వచ్చిన మార్పును స్వీకరించి ఆడాల్సిందే. ఎందుకంటే.. ఫామ్‌లోని తనకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటే కష్టం. అలాంటిది రోహిత్‌ శర్మ లేకపోవడంతో ఏకంగా ఓపెనర్‌గా ఆడే అవకాశం రాబోతుంది. కనీసం దీన్ని అయినా.. రాహుల్‌ సద్వినియోగం చేసుకొని.. పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని ఫ్యాన్స్‌ కొరుకుంటున్నారు. మరి రాహుల్‌ లాంటి ప్లేయర్‌ ప్రపంచంలో ఎక్కడా లేడంటూ.. అతనికి సపోర్ట్‌గా నిలుస్తూ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments