iDreamPost
android-app
ios-app

తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడిన గంభీర్‌! నిజంగానే నమ్మండి..

  • Published Sep 18, 2023 | 5:42 PM Updated Updated Sep 18, 2023 | 5:42 PM
  • Published Sep 18, 2023 | 5:42 PMUpdated Sep 18, 2023 | 5:42 PM
తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడిన గంభీర్‌! నిజంగానే నమ్మండి..

వరల్డ్‌ కప్‌ గెలిపించింది ధోని ఒక్కడే కాదని, అతనొక్కడే క్రెడిట్‌ కొట్టేశాడని పదే పదే కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడు. పైగా అది కూడా ఒక వ్యాలీడ్‌ పాయింగ్‌ మాట్లాడాడు. ఇంతవరకు ధోని గురించి ఎవరూ చెప్పని విషయం చెప్పి.. నిజమే కదా అనిపించాడు. ఇంతకీ ధోని గురించి గంభీర్‌ ఏం చెప్పాడాని అని ఆలోచిస్తున్నారా..? గంభీర్‌ ఏమన్నాడంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ లాంటి ఆటగాడు టీమ్‌లో ఉండటం తమ అదృష్టంగా ఎవరైనా భావిస్తారని, టీమిండియాకు ధోని దొరకడం కూడా ఒక వరం అని అన్నాడు.

అలాగే ధోని కెప్టెన్‌ కావడం వల్ల తన అంతర్జాతీయ పరుగులను త్యాగం చేశాడనే ముఖ్యమైన పాయింట్‌ను మాట్లాడాడు. ధోని వికెట్‌ కీపర్‌ కంటే ముందు అద్భుతమైన బ్యాటర్‌. టీమిండియా దొరికిన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్లలో ధోని ది బెస్ట్‌ అని పేర్కొన్నాడు. ధోని తన ఆరంభం మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడని, కెప్టెన్‌ అయిన తర్వాత తన ఆ స్థానం కాకుండా 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడని, కెప్టెన్‌ అవ్వడం కారణంగా ధోని తన కంటే కూడా టీమ్‌ గురించే ఎక్కువ ఆలోచించాడని.. అందుకే లోయర్‌ ఆర్దర్‌లో ఆడేవాడని అన్నాడు. ధోని కెప్టెన్‌ కాకపోయి ఉంటే.. వన్డేల్లో మూడో స్థానంలోనే బ్యాటింగ్‌ చేసేవాడని.. అప్పుడు ఎన్నో సెంచరీలో, టన్నుల కొద్ది పరుగులు ధోని ఖాతాలో ఉండేవని అన్నాడు.

ధోని అంటే అందరికీ.. ట్రోఫీలు గుర్తుకువస్తాయని, కానీ అంతకుమించి ధోని గొప్ప బ్యాటర్‌ అని, కానీ టీమ్‌ కోసం తన బ్యాటింగ్‌ స్థానాన్ని, దాంతో పాటే తన పరుగులను ధోని త్యాగం చేశాడని గంభీర్‌ చెప్పుకోచ్చాడు. నిజానికి గంభీర చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ధోని 350 వన్డేలు ఆడి 297 ఇన్నింగ్స్‌ల్లో 10773 పరుగులు చేశాడు. వాటిలో 10 సెంచరీలు 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 84 సార్లు నాటౌట్‌గా మిగిలాడు. 6, 7 స్థానాల్లో ఆడితేనే ధోని ఇన్ని పరుగులు చేయగలిగితే.. ఇక మూడో స్థానంలో ఆడి ఉంటే.. ఇంకెన్ని పరుగులు చేసేవాడో అని ఫ్యాన్స్‌ కూడా భావిస్తున్నారు. లోయర్‌ ఆర్డర్‌ ఆడి బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. మూడో స్థానంలో ఆడి ఉంటే.. సచిన్‌ రికార్డులను బద్దలుకొట్టేవాడని కూడా క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చెత్త బౌలర్‌ నుంచి నెం.1 బౌలర్‌గా.. సిరాజ్‌ జర్నీ ఓ వండర్‌!