iDreamPost
android-app
ios-app

టీమిండియాలో వాళ్ల డామినేషన్​కు చెక్.. BCCIకి తేల్చిచెప్పిన గంభీర్!

  • Published Jun 19, 2024 | 9:13 PM Updated Updated Jun 19, 2024 | 9:13 PM

భారత జట్టులో ఇక వాళ్ల డామినేషన్​కు చెక్ పడనుంది. ఆ విషయంలో బీసీసీఐకి గౌతం గంభీర్ తన నిర్ణయాన్ని తేల్చిచెప్పాడని తెలుస్తోంది.

భారత జట్టులో ఇక వాళ్ల డామినేషన్​కు చెక్ పడనుంది. ఆ విషయంలో బీసీసీఐకి గౌతం గంభీర్ తన నిర్ణయాన్ని తేల్చిచెప్పాడని తెలుస్తోంది.

  • Published Jun 19, 2024 | 9:13 PMUpdated Jun 19, 2024 | 9:13 PM
టీమిండియాలో వాళ్ల డామినేషన్​కు చెక్.. BCCIకి తేల్చిచెప్పిన గంభీర్!

ప్రస్తుత క్రికెట్​లో చాలా టీమ్స్​లో ఓ విషయాన్ని కామన్​గా చూడొచ్చు. జట్టులో చోటు దక్కించుకున్న ఏ క్రికెటర్ అయినా సరే బాగా రాణిస్తే అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్​ ప్లేయర్‌‌ అయిపోవచ్చు. ఎక్కువ కాలం నిలకడగా రాణించి సీనియర్​గా మారితే ఫెయిలైనా అన్ని ఫార్మాట్లలోనూ కంటిన్యూ అవుతుండటం చూస్తున్నాం. సీనియర్లు కాబట్టి జట్టు నుంచి అంత ఈజీగా పక్కకు జరిపే ఛాన్స్ ఉండదు. అయితే క్రికెట్ ఒకప్పటిలా లేదు. ఊపిరి సలపని షెడ్యూల్స్ వల్ల అన్ని ఫార్మాట్లలోనూ ఆటగాళ్లు ఆడటం కష్టంగా మారింది. ఒకవేళ అన్ని అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడితే గాయాలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీని వల్ల కీలక మ్యాచ్​కు ఆ ప్లేయర్ దూరమైతే జట్టుకే నష్టం. అయినా కొందరు సీనియర్లు జట్టును పట్టుకొని వేలాడుతుంటారు. అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో కొనసాగుతుంటారు.

భారత క్రికెట్​లో కూడా ఈ వాతావరణం ఉంది. కానీ దీన్ని మార్చాలని చూస్తున్నాడు గౌతం గంభీర్. టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న గౌతీ.. బోర్డు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దల దగ్గర ఓ విషయాన్ని తేల్చిచెప్పాడట. టీమ్​లో సీనియర్ల డామినేషన్​కు చెక్ పెట్టాలని అన్నాడట. ప్రతి ఫార్మాట్​కు ఓ సెపరేట్ టీమ్ ఉండాలని.. డిఫరెంట్ ప్లేయర్స్ ఉండాలని గౌతీ అన్నాడని సమాచారం. టీ20 క్రికెట్ కోసం ఐపీఎల్ మీద అతిగా ఆధారపడొద్దని చెప్పాడట. జట్టులోని సీనియర్లను వన్డేలు, టెస్టులకు మాత్రమే ఉపయోగించాలని గంభీర్ బోర్డు పెద్దలకు సూచించాడని టాక్ నడుస్తోంది. దీంతో టీ20 వరల్డ్ కప్ ముగిశాక భారత క్రికెట్​లో భారీ మార్పులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మూడు ఫార్మాట్లకు మూడు టీమ్స్ ఉండటంతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు కూడా ఉండాలని గంభీర్ బోర్డుకు చెప్పాడని వినికిడి. గౌతీ నిర్ణయాల వల్ల ఫార్మాట్​తో సంబంధం లేకుండా భారత్ ఆడే అన్ని మ్యాచుల్లోనూ ఉండే కొందరు సీనియర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ లాంటి పలువురు సీనియర్లు అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో ఉంటారు. గౌతీ నిర్ణయాలను బోర్డు అమల్లోకి తీసుకొస్తే వీళ్లు వన్డేలు, టెస్టులకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కెప్టెన్ల హయాంలో ఆడాల్సి ఉంటుంది. పొట్టి క్రికెట్​లో పూర్తిగా యువరక్తం వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్స్ సీనియర్ల డామినేషన్​కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే గంభీర్ ఈ ప్రతిపాదనను బోర్డు ముందు పెట్టాడని అంటున్నారు.