Gautam Gambhir: వాళ్లు దొరకడం గంభీర్ చేసుకున్న అదృష్టం.. ఇక ఆకాశమే హద్దు: రవిశాస్త్రి

లెజెండ్ గౌతం గంభీర్ కెరీర్​లో రేపు మరో ఛాప్టర్ స్టార్ట్ కానుంది. టీమిండియా నయా కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. లంక సిరీస్​తో తన ఫస్ట్ ఎసైన్​మెంట్​ను మొదలుపెట్టనున్నాడు.

లెజెండ్ గౌతం గంభీర్ కెరీర్​లో రేపు మరో ఛాప్టర్ స్టార్ట్ కానుంది. టీమిండియా నయా కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. లంక సిరీస్​తో తన ఫస్ట్ ఎసైన్​మెంట్​ను మొదలుపెట్టనున్నాడు.

లెజెండ్ గౌతం గంభీర్ కెరీర్​లో రేపు మరో ఛాప్టర్ స్టార్ట్ కానుంది. టీమిండియా నయా కోచ్​గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. లంక సిరీస్​తో తన ఫస్ట్ ఎసైన్​మెంట్​ను మొదలుపెట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం మెన్ ఇన్ బ్లూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. గత రెండ్రోజులుగా నెట్స్​లో ఆటగాళ్లంతా చెమటలు చిందించారు. బ్యాటర్లు తమ టెక్నిక్​ను మెరుగుపర్చుకోవడంపై వర్క్ చేశారు. బౌలర్లు లంక కండీషన్స్​కు అలవాటు పడటంపై పని చేశారు. కొందరు బ్యాట్స్​మెన్ బౌలింగ్ సాధన కూడా చేశారు. అడిషనల్ బౌలర్ ఉంటే టీమ్​కు మరింత హెల్ప్ అవుతుంది కాబట్టి కొందరు బ్యాటర్లతో బౌలింగ్ సాధన చేయించాడు గంభీర్.

ఫీల్డింగ్​ బెటర్​మెంట్​పై కూడా గంభీర్ దృష్టి సారించాడు. ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్​తో కలసి స్పెషల్ డ్రిల్ ప్లాన్ చేశాడు. ఆటగాళ్లంతా ఇందులో చురుగ్గా పాల్గొన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​తో పాటు మిగిలిన ప్లేయర్లంతా త్రోలు విసరడం, క్యాచ్​లు అందుకోవడం, డైవింగ్ క్యాచెస్​ను పట్టుకోవడం మీద ఫోకస్ పెట్టారు. ఈ నెట్ సెషన్ చూస్తుంటే సిరీస్​లో మనోళ్లు కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రేపు జరగబోయే ఫస్ట్ టీ20 కోచ్​గా గంభీర్​కు తొలి అడుగు కావడంతో అందరూ అతడికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు. టీమ్​ను సక్సెస్ బాటలో నడిపించాలని కోరుతున్నారు. ఈ తరుణంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాంటి ప్లేయర్లు దొరకడం గౌతీ చేసుకున్న అదృష్టమని.. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగాలని అన్నాడు.

‘గంభీర్​ కూల్​గా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడు. అతడికి నాన్సెన్స్ నచ్చదు. హెడ్ కోచ్​గా టీమ్​ను ఎలా నడిపించాలనే విషయంలో అతడికి స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి. గౌతీ అదృష్టం ఏంటంటే.. అతడి చేతిలో సూపర్ టీమ్ ఉంది. ఆటగాళ్లంతా చాలా మెచ్యూర్డ్. ఇది చాలా మెచ్యూర్, సెటిల్ట్ టీమ్. ఇలాంటి ప్లేయర్లు దొరికినందుకు అతడు లక్కీ. అయితే ఆటగాళ్లకు కూడా గంభీర్ లాంటోడి అవసరం ఉంది. ఎంత మెచ్యూరిటీ ఉన్నా తాజా ఆలోచనలతో ముందుకు నడిపించే వారు కావాలి. ఆ దృష్ట్యా ఇది భారత జట్టుకు ఇది గుడ్ టైమ్’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. కోచింగ్ ఇస్తూనే ప్లేయర్ మేనేజ్​మెంట్ మీద కూడా గంభీర్ ఫోకస్ పెట్టాలని ఆయన సూచించాడు. ఇది ఎంతో కీలకమని.. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని మీదే సక్సెస్ ఆధారపడుతుందన్నాడు రవిశాస్త్రి. మరి.. టీమిండియా లాంటి మెచ్యూర్ టీమ్ దొరకడం గంభీర్ అదృష్టమనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments