iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: టీమిండియా హెడ్‌ కోచ్‌గా అపాయింట్‌ అవుతూనే రికార్డు సృష్టించిన గంభీర్‌!

  • Published Jul 10, 2024 | 4:08 PM Updated Updated Jul 10, 2024 | 4:08 PM

Gautam Gambhir, Head Coach: రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా.. భారత జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. రావడం రావడంతోనే ఓ అరుదైన రికార్డు సాధించాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Head Coach: రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా.. భారత జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. రావడం రావడంతోనే ఓ అరుదైన రికార్డు సాధించాడు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 10, 2024 | 4:08 PMUpdated Jul 10, 2024 | 4:08 PM
Gautam Gambhir: టీమిండియా హెడ్‌ కోచ్‌గా అపాయింట్‌ అవుతూనే రికార్డు సృష్టించిన గంభీర్‌!

గత కొంత కాలంగా క్రికెట్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నట్లుగానే టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలంతో ముగియడంతో.. అతని స్థానంలో గంభీర్‌ను అపాయింట్‌ అయ్యాడు. అయితే.. హెడ్‌ కోచ్‌గా అలా నియమకం అయ్యాడో లేదో.. ఓ రికార్డును క్రియేట్ చేశాడు గంభీర్‌. వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు.. టీమిండియాకు హెడ్‌ కోచ్‌ అవ్వడం ఇది ఐదోసారి. గంభీర్‌ కంటే ముందు నలుగురు కోచ్‌లు టీమిండియా తరఫున వరల్డ్‌ కప్‌ గెలిచిన వారే. మొత్తంగా వరల్డ్‌ కప్‌ గెలిచి భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా పనిచేయబోతున్న ఐదో క్రికెటర్‌ గంభీర్‌.

టీమిండియాకు చాలా మంది హెడ్‌ కోచ్‌లుగా పనిచేశారు. కానీ, అందులో చాలా మంది భారత్‌ తరఫున వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యులు కాదు. తాజా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన రికార్డు లేదు. అయితే.. గంభీర్‌ కంటే ముందు టీమిండియాకు హెడ్‌ కోచ్‌లుగా పని చేసిన భారత మాజీ క్రికెటర్లలో వరల్డ్‌ కప్‌ గెలిచిన సభ్యులు నలుగురు కూడా.. 1983 బ్యాచ్‌కి చెందిన వారే. సందీప్‌ పాటిల్‌, మదన్‌ లాల్‌, కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి.. వీళ్లు నలురుగు వన్డే వరల్డ్‌ కప్‌ 1983 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యులు. కపిల్‌ దేవ్‌ ఆ టీమ్‌కు కెప్టెన్‌.

1983 తర్వాత టీమిండియా మళ్లీ 28 ఏళ్లకు అంటే 2011లో ధోని కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌ కప్‌ సాధించింది. ఈ టీమ్‌లో గౌతమ్‌ గంభీర్‌ సభ్యుడు. ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు వరల్డ్‌ కప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. 1983 బ్యాచ్‌ నుంచి కాకుండా.. వరల్డ్‌ కప్‌ గెలిచి టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా పనిచేయబోతున్న తొలి భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభరే. 2011లో వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ధోని లాంటి హేమాహేమీలు ఉన్నా.. గంభీర్‌కే ఈ అరుదైన అవకాశం దక్కింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.