వరల్డ్ కప్ ఫైనల్‌లో బాగా ఆడాలంటే.. ఆ ఒక్కడి వల్లే సాధ్యం!

ఏ ప్రపంచ కప్‌ అయినా కూడా.. టోర్నీ మొత్తం ఒక ఎత్తు.. ఫైనల్‌ మ్యాచ్‌ ఒక ఎత్తు. అందుకే ఫైనల్స్‌లో బాగా ఆడితే చిరస్థాయిగా నిలిచిపోతారు. అయితే.. అది అందరి ఆటగాళ్ల వల్ల కాదు. కొందరు మాత్రం కేవలం ఫైనల్స్‌ కోసం మాత్రమే పుట్టినట్లు ఉంటారు. అలాంటి వాడే ఈ టీమిండియా క్రికెటర్‌. మరి అతనెవరో ఇప్పుడు చూద్దాం..

ఏ ప్రపంచ కప్‌ అయినా కూడా.. టోర్నీ మొత్తం ఒక ఎత్తు.. ఫైనల్‌ మ్యాచ్‌ ఒక ఎత్తు. అందుకే ఫైనల్స్‌లో బాగా ఆడితే చిరస్థాయిగా నిలిచిపోతారు. అయితే.. అది అందరి ఆటగాళ్ల వల్ల కాదు. కొందరు మాత్రం కేవలం ఫైనల్స్‌ కోసం మాత్రమే పుట్టినట్లు ఉంటారు. అలాంటి వాడే ఈ టీమిండియా క్రికెటర్‌. మరి అతనెవరో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమితో భారత క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. టోర్నీ మొత్తం ఎంతో అద్భుతంగా ఆడిన భారత జట్టు.. ఫైనల్లో కూడా కచ్చితంగా గెలుస్తుందని అంతా గట్టిగా నమ్మారు. కప్పు మనదేనని బలంగా ఫిక్స్‌ అయిపోయారు. కానీ, తీరా మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ.. ప్రపంచ కప్‌ టీమిండియాకు దూరంగా జరుగుతూ పోయింది. రోహిత్‌ శర్మ కప్పు ఎత్తుతుంటే చూడాలని ఆశపడిన ప్రతి క్రికెట్‌ అభిమానుల కళ్ల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఇంత అద్భుతమైన టీమ్‌ కూడా కప్పు కొట్టలేకపోతే.. ఇంకెప్పుడు భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. టోర్నీ ఆసాంతం టీమ్‌లో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడినా.. ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలం అయ్యారు.

10 మ్యాచ్‌లు ఏకబిగిన అదరగొట్టిన వాళ్లు.. ఫైనల్‌కు వచ్చేసరికి ఎందుకు తేలిపోయారో చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌ అంటే మిగతా మ్యాచ్‌ల్లాంటిది కాదు. ఏదో తెలియన టన్నుల బరువు ఆటగాళ్లపై ఒత్తిడి రూపంలో ఉంటుంది. పైగా లక్ష మందికి పైగా క్రికెట్‌ అభిమానుల ముందు, 100 కోట్ల మంది ఆశలను మోస్తూ.. వారి అంచనాలను అందుకోవడం అంటే మాటలు కాదు. ఇక్కడే.. చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడికి చిత్తు అవుతుంటారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కూడా చూసుకుంటే.. యువ క్రికెటర్లంతా విఫలం అయ్యారు. రోహత్‌ శర్మ, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా లాంటి సీనియర్లే కాస్త పర్వాలేదనిపించారు. గిల్‌, శ్రేయస్‌, సూర్య, సిరాజ్‌, కుల్దీప్‌ ఇలా యువ క్రికెటర్లంతా దారుణంగా ఫెయిల్‌ అయ్యారు. అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చడం అందరి వల్ల అయ్యే పని కాదంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అసలు టీమిండియా ఫైనల్స్‌ ఆడుతుందంటేనే ఓ క్రికెటర్‌ అందరి మైండ్‌లో కదులుతాడు. ఫైనల్స్‌లో ఎలా ఆడాలో, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అతని తెలినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. అతనెవరో కాదు.. టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌. ఆదివారం ఆస్ట్రేలియాతో ఫైనల్స్‌ చూసిన తర్వాత క్రికెట్‌ అభిమానులు మరోసారి గంభీర్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. గంభీర్‌ లాంటి ప్లేయర్‌ లేకుంటే.. మనకు 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చేదే కాదని అంటున్నారు. నిజానికి గంభీర్‌ పోరాటంతోనే ఆ వరల్డ్‌ కప్స్‌ను టీమిండియా ముద్దాడగలిగింది. టోర్నీ మొత్తం ఒక ఎత్తు.. ఫైనల్‌ మ్యాచ్‌ ఒక ఎత్తు. అలాంటి బిగ్‌ మ్యాచ్లులో గంభీర్‌ అద్భుతంగా ఆడాడు. అతని పోరాటం పటిమ ఎంత గొప్పదో.. చెప్పడానికి టీమిండియా గెలిచిన 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ గురించి మాట్లాడుకోవాలి.

సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ 2007లో భారత్‌ పూర్తిగా యువ క్రికెటర్లతో వెళ్లింది. వీరేందర్‌ సెహ్వాగ్‌ ఒక్కడే ఆ జట్టులో మోస్త సీనియర్‌ అండ్‌ ఎక్కువ వయసున్న ఆటగాడు. ఆ జట్టుకు ధోని నాయకత్వం వహించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆ టోర్నీలోకి వెళ్లిన టీమిండియా.. మంచి ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరింది. ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌. అంతా యువకులు, ఫైనల్‌ మ్యాచ్‌, పైగా పాకిస్థాన్‌తో అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ ఒత్తిడికి దాదాపు మన టీమ్‌ మొత్తం చిత్తు అయింది. గంభీర్‌ ఒక్కడే పాకిస్థాన్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. టీమ్‌ మొత్తం 20 ఓవర్లలో 157 పరుగులు చేస్తే.. గంభీర్‌ ఒక్కడే 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 75 పరుగులు చేశాడు. యూసుఫ్‌ పఠాన్‌ 15, రాబిన్‌ ఊతప్ప 8, యువరాజ్‌ సింగ్‌ 14, ధోని 6 ఇలా అంతా విఫలం అయ్యారు. చివర్లో రోహిత్‌ శర్మ 16 బంతుల్లో 30 రన్స్‌ చేసి రాణించాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 158 పరుగులు టార్గెట్‌ను కాపాడుకోగలింది అంటే.. అంత ఒత్తిడిలో గంభీర్‌ ఆడిన ఇన్నింగ్సే కీలకం.

ఇక 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను టీమిండియా శ్రీలంకతో ఆడింది. ఆ మ్యాచ్‌లో లంక.. భారత్‌ ముందు 275 పరుగుల టార్గెట్‌ ఉంచింది. ఆ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టోర్నీ మొత్తం ఎంతో అద్భుతంగా ఆడి అదరిపోయే ఆరంభాలు అందించిన సెహ్వాగ్‌-సచిన్‌ టెండూల్కర్‌ వెంటవెంటనే అవుట్‌ అవ్వడంతో భారత క్రికెట్‌ అభిమానులంతా టీవీలు ఆఫ్‌ చేసేసి ఆశలు వదులుకున్నారు. కానీ, ఒక్కడు మాత్రం టీమిండియా గెలుస్తుందని బలంగా నమ్మడమే కాకుండా.. అంతే స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు అతనే గౌతమ్‌ గంభీర్‌. 31 పరుగులకే సెహ్వాగ్‌, సచిన్‌ వికెట్లు పడిపోయిన తర్వాత.. కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం, ఆ తర్వాత ధోనితో పార్ట్నర్‌షిప్‌ నెలకొల్పి.. 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజ్‌లో గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో గంభీర కష్టం.. అతని జెర్సీ చూస్తే అర్థం అవుతుంది. ఈ రెండు వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లోనూ గంభీరే టాప్‌ స్కోరర్‌. అందుకే ఫైనల్స్‌ ఆడాలంటే గంభీర తర్వాత ఎవరైనా. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments