iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: గంభీర్​ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నాడా? ఇంత సపోర్ట్ ఉన్నా దేనికి ఫియర్?

  • Published Jul 22, 2024 | 9:31 PM Updated Updated Jul 22, 2024 | 9:31 PM

టీమిండియా కొత్త కోచ్ గంభీర్ డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్రతి విషయంలో కచ్చితత్వంతో ఉంటున్నాడు. అయితే ఒకదాంట్లో మాత్రం అతడు రిస్క్ తీసుకునేందుకు భయపడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టీమిండియా కొత్త కోచ్ గంభీర్ డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్రతి విషయంలో కచ్చితత్వంతో ఉంటున్నాడు. అయితే ఒకదాంట్లో మాత్రం అతడు రిస్క్ తీసుకునేందుకు భయపడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published Jul 22, 2024 | 9:31 PMUpdated Jul 22, 2024 | 9:31 PM
Gautam Gambhir: గంభీర్​ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నాడా? ఇంత సపోర్ట్ ఉన్నా దేనికి ఫియర్?

టీమిండియా కొత్త కోచ్ గంభీర్ డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్రతి విషయంలో కచ్చితత్వంతో ఉంటున్నాడు. శ్రీలంక సిరీస్​తో కోచ్​గా బాధ్యతలు చేపట్టనున్న గౌతీ ఇవాళ నిర్వహించిన ప్రెస్​మీట్​లో అనేక విషయాలపై రియాక్ట్ అయ్యాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో బాండింగ్ దగ్గర నుంచి సూర్యకుమార్ యాదవ్​కు కెప్టెన్సీ, రవీంద్ర జడేజాను టీమ్​లో నుంచి తప్పించడం, వన్డే వరల్డ్ కప్-2027 ప్లానింగ్ వరకు చాలా విషయాలపై అతడు క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీతో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. సూర్యను టీ20లకు మాత్రమే పరిమితం చేస్తున్నామని.. అతడు కెప్టెన్​గా సక్సెస్ అవుతాడని భావిస్తున్నట్లు తెలిపాడు. జడేజాను వన్డేల నుంచి తీసేయలేదని.. అక్షర్ పటేల్ అందుబాటులో ఉండటంతో అతడ్ని బెంచ్​పై పెట్టామన్నాడు.

వన్డేలు, టెస్టుల్లో జట్టుకు జడేజా సేవలు అవసరమని.. అతడు ఎంతో కీలక ఆటగాడని గంభీర్ చెప్పాడు. యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ను మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలని అనుకుంటున్నామని పేర్కొన్నాడు. హార్దిక్​ పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడానికి ఫిట్​నెస్​ ఇష్యూస్​ కారణమని గౌతీ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్​ సిరీస్​తో వెటరన్ పేసర్ మహ్మద్ షమి కమ్​బ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించాడు. ఇలా చాలా విషయాలపై నయా హెడ్ కోచ్ క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడాడు. కానీ ఒక విషయంపై మాత్రం అతడు పొడిపొడిగా జవాబిచ్చాడు. అదే మూడు ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు. గంభీర్​కు బీసీసీఐ ఇంటర్వ్యూ నిర్వహించిన టైమ్​లోనే ప్రతి ఫార్మాట్​కు ఓ సెపరేట్ టీమ్ ఉండాలని చెప్పాడని వినిపించింది. ఇదే విషయంపై ప్రెస్​మీట్​లో అడిగితే మాత్రం సూటిగా సమాధానం ఇవ్వలేదు.

ప్రెస్​మీట్​లో చాలా విషయాల మీద స్పష్టత ఇచ్చిన గంభీర్.. మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్ల గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తమకు అలాంటి ప్లానింగ్ ఉందన్నాడు. కానీ దానిపై ఎక్కువ మాట్లాడలేదు. అయితే సూర్యను ఒకే ఫార్మాట్​కు పరిమితం చేసిన గౌతీ.. మిగిలిన సీనియర్ల విషయంలో అలాంటి డెసిషన్ తీసుకునే ధైర్యం లేకే ఫార్మాట్​కు ఒక టీమ్ అనే ఆలోచనను ప్రస్తుతం విరమించుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్, కోహ్లీ, బుమ్రా, గిల్, పంత్ ఎలాగూ అన్ని ఫార్మాట్లలో ఆడతారు. మిగతా వారి ఫిట్​నెస్​, ఫార్మాట్ సూటబులిటీ విషయంలో ఓ క్లారిటీ లేకే ఇలా చేశాడా? అనేది అనుమానంగా మారింది. అయితే బీసీసీఐ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న గౌతీ.. మూడు ఫార్మాట్లపై కూడా తేల్చేస్తే అయిపోయేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. బీసీసీఐ నుంచి సపోర్ట్, ఫుల్ పవర్స్ ఉన్నా గంభీర్ ఎందుకు ఈ విషయాన్ని నాన్చుతున్నాడో అర్థం కావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.