iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: SRHతో మ్యాచ్ కు ముందు.. యంగ్ ప్లేయర్లకు గంభీర్ కీలక సూచన!

  • Published May 21, 2024 | 8:19 AM Updated Updated May 21, 2024 | 8:19 AM

రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా యంగ్ ప్లేయర్లకు కీలక సూచనలు ఇచ్చాడు.

రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా యంగ్ ప్లేయర్లకు కీలక సూచనలు ఇచ్చాడు.

Gautam Gambhir: SRHతో మ్యాచ్ కు ముందు.. యంగ్ ప్లేయర్లకు గంభీర్ కీలక సూచన!

గౌతమ్ గంభీర్.. కోల్ కత్తా మెంటర్ గా ఆ జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. తన వ్యూహాలతో ప్రత్యర్థుల చిత్తుచేయడంలో గంభీర్ దిట్ట. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో పటిష్టమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీకొనబోతోంది. నేడు(మంగళవారం) అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా యంగ్ ప్లేయర్లకు కీలక సూచనలు ఇచ్చాడు.

ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. రెండు సమవుజ్జీ జట్ల మధ్య సాగే ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కు ముందు గౌతమ్ గంభీర్ టీమిండియా యంగ్ ప్లేయర్లకు కొన్ని కీలక సూచనలు చేశాడు. టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ..”ప్రస్తుతం ఐపీఎల్ లో టీమిండియా యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే వీరిలో ఎంత మంది టీమిండియాకు టెస్టుల్లో ఆడాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తోంది. టీమిండియాకు ఆడాలంటే ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు గంభీర్.

ఇక సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ కోసం మేము పూర్తిగా సిద్దమైయ్యామని గంభీర్ పేర్కొన్నాడు. మా ప్లేయర్లకు పరిస్థితులకు తగ్గట్లుగా దూకుడుగా ఆడాలని చెప్పినట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతం టీ20 క్రికెట్ కంటే.. ఐపీఎల్ మరింత పోటీగా మారిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గంభీర్. యంగ్ ప్లేయర్లు కేవలం టీ20లు ఆడటంపైనే దృష్టి పెట్టకూడదు అంటూ వారికి సూచించాడు. ఇక తాను ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు అన్న ప్రశ్నకు కూడా ఈ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. నేను నవ్వితే చూడాలని ప్రేక్షకులు రావట్లేదని, టీమ్ గెలిస్తే చూడాలని వస్తున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి నేనేమీ బాలీవుడ్ నటుడిని కాదని తనదైన శైలిలో స్పందించాడు.