SNP
Gautam Gambhir, Sourav Ganguly, IND vs SL: భారత జట్టు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలా ఆలోచిస్తూ.. టీమిండియాలోని ఒక పెద్ద లోటు తీరుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Gautam Gambhir, Sourav Ganguly, IND vs SL: భారత జట్టు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలా ఆలోచిస్తూ.. టీమిండియాలోని ఒక పెద్ద లోటు తీరుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
భారీ అంచనాల మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. తొలి అసైన్‌మెంట్‌లో సూపర్ సక్సెస్ అయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్లు లేకుండా.. శ్రీలంకను వాళ్ల గడ్డపైనే క్లీన్‌స్వీప్ చేశాడు. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో సూర్య సేన గెలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయంతో గంభీర్ సంతోషంగా ఉన్నాడు. అయితే.. తొలి సిరీస్‌తోనే గంభీర్ తన మార్క్ కోచింగ్‌ను టీమిండియాలో ప్రవేశపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే.. భారత జట్టు ఒకప్పుడు బలంగా ఉపయోగపడిన ఫార్ములాను తిరిగి ప్రవేశపెట్టి.. తన ముద్ర వేశాడు. గంభీర్ కోచింగ్ చూసి.. తమకు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ గుర్తుకు వస్తోందని చాలా మంది క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు గంభీర్ కోచింగ్‌కి, గంగూలీ కెప్టెన్సీకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఒక సారి గమనిస్తే.. టీమిండియాలో చాలాకాలంగా మిస్ అయిన ఒక ఎలిమెంట్ కనిపించింది. అదేంటంటే.. పార్ట్‌టైమ్ బౌలర్ల ఇంప్యాక్ట్. తొలి మ్యాచ్‌లో యువ క్రికెటర్ రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీశాడు, రెండో మ్యాచ్‌లో కూడా సిరాజ్, అర్షదీప్, హార్దిక్ పాండ్యా పూర్తి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయిన చోట కూడా రియాన్ పరాగ్ 4 ఓవర్లు వేసి 30 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతం చేసి.. మ్యాచ్ గెలిపించారు. తొలిసారి బౌలింగ్ వేస్తూ.. 12 బంతుల్లో 9 రన్స్‌ను డిఫెండ్ చేసి, చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా పార్ట్‌టైమ్ బౌలర్లను బాగా ఎంకరేజ్ చేసేశాడు. సచిన్ టెండూల్కర్ కెరీర్ ఆరంభం నుంచే పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉన్నాడు. అయితే.. దాదా కెప్టెన్ అయిన తర్వాత.. తాను బౌలింగ్ వేయడంతో పాటు.. వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా లాంటి బౌలర్లను అద్భుతంగా వినియోగించుకుని.. మంచి ఫలితాలు రాబట్టాడు. సచిన్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తన స్పిన్ మ్యాజిక్‌తో ఎన్నో మ్యాచ్‌లు కూడా గెలిపించారు. ప్రధాన బౌలర్లు విఫలమైన చోట మేమున్నాం అంటూ.. జట్టును ఆదుకోవడమే కాదు.. మెయిన్ బౌలర్లను మించి రాణిస్తూ.. మ్యాచ్‌లు ఒంటి చేత్తో గెలిపించేవారు. సచిన్, సెహ్వాగ్, యువీ బాల్‌తో గెలిచిపించిన మ్యాచ్‌ల గురించి చెప్పుకోవాలంటే.. చాలా ఉన్నాయి.
అయితే.. ఈ పార్ట్‌టైమ్ బౌలర్ల వినియోగం టీమిండియాలో క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు యువీ, రైనా రూపంలో పరిస్థితి కాస్త పర్వాలేదు. కానీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ హయాంలో అయితే.. బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేసేవారు. బ్యాటర్లు బంతి పట్టుకున్న దాఖలాలు చాలా తక్కువ. ఈ ధోరణి భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధాన బౌలర్లు వాళ్ల టైమ్ బాగోలేక ఏదైన మ్యాచ్‌లో కాస్త లయ తప్పి.. భారీ పరుగులు ఇచ్చుకుంటున్నా.. వేరే గతి లేక వాళ్లే పూర్తి ఓవర్ల కోటా కంప్లీట్ చేయాల్సి వచ్చేంది. దాంతో వికెట్లు పడకపోగా.. భారీగా రన్స్ పోయేవి. ఆ టైమ్‌లో పార్ట్‌టైమ్ బౌలర్‌ను ప్రయోగిస్తే.. ప్రధాన బౌలర్లకు కాస్త ఊరటతో పాటు, ప్రత్యర్థి బ్యాటర్లు కాస్త సర్‌ప్రైజ్ ఫీల్ అయి.. జాగ్రత్తగా అయినా ఆడేవాళ్లు, ఎక్కువ రన్స్ చేయాలనే ఆత్రుతలో వికెట్ అయిన ఇచ్చేవాళ్లు. చాలా సందర్భాల్లో పార్ట్‌టైమ్ బౌలర్లు మ్యాచ్‌లను ములుపుతిప్పారు.
గంగూలీ కెప్టెన్సీలో ఆడిన గంభీర్.. పార్ట్‌టైమ్ బౌలర్ ప్రాధాన్యత ఏంటో బాగా తెలుసుకున్నాడు. ఇంతకాలం టీమిండియాలో మిస్ అయిన ఆ ఎలిమెంట్‌ను తిరిగి ప్రవేశపెట్టాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచే.. బౌలింగ్ వేయగల ప్రతి బ్యాటర్‌తో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించడమే కాదు.. ఎంతో కీలక సమయాల్లో రియాన్ పరాగ్, రింకూ సింగ్, సూర్యకుమార్‌తో బౌలింగ్ చేయించి.. అద్భుత ఫలితం రాబట్టాడు. శ్రీలంక సిరీస్ ఫలితంతో ఇకపై టీమిండియా పార్ట్‌టైమ్ బౌలర్లను విరివిగా ప్రయోగించే అవకాశం ఉంది. మరి ఒకప్పుడు గంగూలీ టీమిండియాలో పార్ట్‌టైమ్ బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ.. టీమ్ ఎక్స్‌ట్రా బలం ఇచ్చినట్లే.. ఇప్పుడు గంభీర్ కూడా పార్ట్‌టైమ్ బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ.. టీమ్‌ను మరింత స్ట్రాంగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Surya Kumar Yadav’s last over. The game changer! #SLvIND pic.twitter.com/Y4ZZ1Am1YR
— Abhishek ✨ (@ImAbhishek7_) July 30, 2024
RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj
— Johns. (@CricCrazyJohns) July 30, 2024