Nidhan
Gautam Gambhir Faces Real Challenge: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అసలు పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఈ టెస్ట్‌లో అతడు పాసై తీరాలి. ఒకవేళ రిజల్ట్ కాస్త తేడాగా వచ్చినా అతడు భారీగా విమర్శల్ని మూటగట్టుకోక తప్పదు.
Gautam Gambhir Faces Real Challenge: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అసలు పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఈ టెస్ట్‌లో అతడు పాసై తీరాలి. ఒకవేళ రిజల్ట్ కాస్త తేడాగా వచ్చినా అతడు భారీగా విమర్శల్ని మూటగట్టుకోక తప్పదు.
Nidhan
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధంగా ఉంది టీమిండియా. రెండు టెస్టుల ఈ సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవడమే మిగిలింది. వారం కిందే చెపాక్‌కు చేరుకున్న రోహిత్ సేన.. సిరీస్ కోసం భీకరంగా ప్రాక్టీస్ చేసింది. ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటలు చిందించారు. బంగ్లాను చిత్తు చేయాలనే పట్టుదలతో ప్రాక్టీస్ సెషన్లో రెట్టింపు కష్టపడ్డారు. ఈ సిరీస్ టీమిండియాకు కొన్ని సవాళ్లు విసురుతోంది. అయితే చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్ బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీనో లేదా కెప్టెన్ రోహిత్ శర్మనో కాదు.. ఈ సిరీస్‌తో అసలు ఛాలెంజ్ ఎదుర్కొంటున్నాడు హెడ్ కోచ్ గంభీర్. ఇది అతడికి అగ్నిపరీక్షగా మారింది. ఈ రియల్ టెస్ట్‌లో గౌతీ నెగ్గి తీరాల్సిందే.
గంభీర్ కోచ్‌గా రావడానికి ముందు విపరీతమైన హైప్ నెలకొంది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే తీసుకోవాలంటూ అటు వెటరన్ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. గంభీర్ కొత్త కోచ్‌గా వస్తే భారత్ సాధించని డబ్ల్యూటీసీ ట్రోఫీతో పాటు ఇతర ఐసీసీ కప్పులు కూడా కొట్టేయడం ఖాయమంటూ జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఆయన కోచ్‌గా వచ్చాక తొలి సిరీస్‌లో మిక్స్డ్ రిజల్ట్స్ చూశాడు. శ్రీలంక సిరీస్‌తో కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడీ లెజెండ్. అయితే పసికూన స్థాయికి పడిపోయిన ఆ టీమ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఎలాగోలా నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఓటమిపాలైంది. రోహిత్, కోహ్లీ, రాహుల్, అయ్యర్ లాంటి హేమాహేమీలు టీమ్‌లో ఉన్నా.. కోచ్‌గా గంభీర్ వెనుక నుంచి నడిపించినా టీమ్ ఫెయిలైంది. అయినా గౌతీ కోచింగ్‌పై పెద్దగా విమర్శలు రాలేదు.
గంభీర్ కోచ్‌గా సెటిల్ అవడానికి, టీమిండియా ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకోవడానికి ఇంకొంత సమయం అవసరమనే ఉద్దేశంతో లంకతో వన్డే సిరీస్‌లో ఓడినా ఆయన్ను ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో మరో కఠిన సవాల్ ఎదురవుతోంది. బంగ్లా ఒకప్పటిలా లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆ టీమ్ మంచి బ్యాలెన్స్‌తో ఉంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో పటిష్టంగా ఉంది. భారత బ్యాటర్లు తప్పు చేస్తే కుప్పుకూల్చాలని వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్నారు. అందుకే బంగ్లాను లైట్ తీసుకోకుండా ఆటగాళ్లందర్నీ వారం ముందు నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు గౌతీ. రోహిత్‌తో కలసి బంగ్లా కోసం స్పెషల్ ప్లాన్స్ కూడా రెడీ చేశాడు. అయితే సిరీస్ పూర్తయ్యే వరకు ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలి.
గంభీర్‌కు ఇది రియల్ టెస్ట్ టైమ్. బంగ్లాను చిత్తుగా ఓడించి వైట్‌వాష్ చేసే వరకు ఆయన వదలొద్దు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ జట్టు షాక్ ఇస్తుంది. అందుకే ప్రతి సెషన్‌ను సీరియస్‌గా తీసుకొని టీమ్ గెలుపు తీరాలకు చేరే వరకు గౌతీ విశ్రమించకూడదు. బంగ్లాను ఓడిస్తే ఓకే.. కానీ రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా తొలి దెబ్బను రుచి చూడాల్సింది గంభీరే. ఆ తర్వాతే రోహిత్‌తో పాటు ఇతర టీమ్‌మేట్స్‌పై విమర్శలు రావొచ్చు. ఒక్క మ్యాచ్ ఓడినా గౌతీ కోచింగ్, అతడి సామర్థ్యంపై లేనిపోని అనుమానాలు, సందేహాలు కమ్ముకునే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గుర్తించి ఆయన మరింత అలర్ట్‌గా ఉంటే బెటర్. రోహిత్, కోహ్లీ, అశ్విన్, బుమ్రా లాంటి సీనియర్ల అండ ఉంది. టీమ్ దుర్భేద్యంగా ఉంది. కాబట్టి ఎలాంటి సంచనాలు జరగకపోవచ్చు. కానీ ఒక్క సెషన్లో రిజల్ట్ మారిపోయే టెస్టుల్లో బంగ్లా లాంటి డేంజరస్ టీమ్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. ఇవన్నీ గంభీర్ దృష్టిలో పెట్టుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.