iDreamPost
android-app
ios-app

తనకు జరిగిన అన్యాయాన్ని.. ఇప్పుడు పాండ్యా, KL రాహుల్‌కు చేసిన గంభీర్‌!

  • Published Jul 20, 2024 | 9:27 AM Updated Updated Jul 20, 2024 | 3:34 PM

Gautam Gambhir, Hardik Pandya, KL Rahul, IND vs SL: టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన విషయంలో జరిగిన తప్పును.. ఇప్పుడు తనే హార్ధిక్‌ పాండ్యా, రాహుల్‌ విషయంలో చేశాడంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. మరి ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, Hardik Pandya, KL Rahul, IND vs SL: టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన విషయంలో జరిగిన తప్పును.. ఇప్పుడు తనే హార్ధిక్‌ పాండ్యా, రాహుల్‌ విషయంలో చేశాడంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. మరి ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 20, 2024 | 9:27 AMUpdated Jul 20, 2024 | 3:34 PM
తనకు జరిగిన అన్యాయాన్ని.. ఇప్పుడు పాండ్యా, KL రాహుల్‌కు చేసిన గంభీర్‌!

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ ఇంకా ఫీల్డ్‌లోకి దిగకముందే.. అతనిపై విమర్శలు వస్తున్నాయి. శ్రీలంకతో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ పూర్తి స్థాయిలో బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతనిపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అందుకు కారణం.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన స్క్వౌడ్స్‌. లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల కోసం భారత సెలెక్టర్లు గురువారం జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ మార్పులతో ఈ జట్లను ప్రకటించారు. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన టీ20 కెప్టెన్సీ పోస్ట్‌తో పాటు టీ20, వన్డేలకు కొత్త వైస్‌ కెప్టెన్సీ పోస్ట్‌ను కూడా భర్తీ చేశారు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యాను తప్పించి.. అతని స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్సీ ఇచ్చారు. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన​్‌ని చేశారు. నిజానికి టీ20లకు హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌ని చేస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా సూర్య కెప్టెన్‌ అయ్యాడు. అయితే.. కెప్టెన్‌ అవుతాడనుకున్న పాండ్యా.. వైస్‌ కెప్టెన్సీని కూడా పోగొట్టుకున్నాడు. అలాగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ను కూడా వన్డే వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతని స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి.. ఫైనల్‌ ఆడిన విషయం తెలిసిందే. ఇలా వన్డేలు, టీ20ల్లో జట్టు మంచి ప్రదర్శన చేసినా.. వైస్‌ కెప్టెన్లను మార్చేశారు.

ఇలా కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ మార్పు‌లో గంభీర్‌ హస్తం ఎక్కువగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే గౌతమ్‌ గంభీర్‌ టీమిండియాకు ఆడుతున్న సమయంలో.. తనను వైస్‌ కెప్టెన్సీ నుంచి కారణం లేకుండా తప్పించారని, జట్టు మంచి ప్రదర్శన చేయకపోతే.. కెప్టెన్‌ను అలాగే ఉంచి, వైస్‌ కెప్టెన్‌ను తప్పించడం ఇండియాలో ఏ ఆటలోనూ జరగలేదని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పట్లో గంభీర్‌కు అది తప్పు అనిపించింది. కానీ, ఇప్పుడు అదే గంభీర్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాను తప్పించి గిల్‌ను వైస్‌ కెప్టెన్‌ చేశాడు. అలాగే వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను తప్పించి గిల్‌కు ఆ బాధ్యతలు అప్పటించాడు.

జట్టు మంచి ప్రదర్శన చేస్తున్నా, వైస్‌ కెప్టెన్లుగా ఉన్న ఆటగాళ్లు ఆయా ఫార్మాట్లలో రాణిస్తున్నా వారిని తప్పించాడు. మరి అప్పుడు గంభీర్‌కు జరిగింది అన్యాయం అయితే.. ఇప్పుడు హార్ధిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌కు జరిగింది కూడా అన్యాయమే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ధోనిని అలా ఉంచి, వైస్‌ కెప్టెన్‌గా తనను తప్పించడాన్ని తప్పుబట్టిన గంభీర్‌.. ఇప్పుడు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ఉంచి కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌ తప్పించడం తప్పు అనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sachin memer (@cricket_memer45)