SNP
Gautam Gambhir, Sunil Narine: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. నిజానికి నరైన్ ఒక మిస్టరీ స్పిన్నర్‌గా మాత్రమే ప్రపంచానికి తెలుసు.. కానీ, అతనిలో ఉన్న బ్యాటింగ్ టాలెంట్‌ను గుర్తుపట్టిందో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, Sunil Narine: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. నిజానికి నరైన్ ఒక మిస్టరీ స్పిన్నర్‌గా మాత్రమే ప్రపంచానికి తెలుసు.. కానీ, అతనిలో ఉన్న బ్యాటింగ్ టాలెంట్‌ను గుర్తుపట్టిందో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఆటగాడు సునీల్ నరైన్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక మిస్టరీ స్పిన్నర్‌గా ఐపీఎల్‌లోకి 2012లో ఎంట్రీ ఇచ్చిన నరైన్.. తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్‌కు కొండంత బలంగా మారాడు. కేకేఆర్‌తో మ్యాచ్ అంటే.. చాలా జట్లు కేవలం 16 ఓవర్ల మ్యాచ్‌గానే భావించేవి. ఎందుకంటే.. నరైన్ వేసే 4 ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడమే సరిపోతుంది.. ఇంకా పరుగులు ఎలాగే రావు. దాంతో తాము 16 ఓవర్ల మ్యాచ్ ఆడుతున్నాం అనే భావనతో ప్రత్యర్థి జట్టు ఒకప్పుడు భావించేవి. ఇప్పటికీ నరైన్ చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు. అందుకే అతన్ని కేకేఆర్ 12 ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉంది. నరైన్ కూడా కేకేఆర్‌కు చాలా లాయల్‌గా ఉన్నాడు. వేరే జట్లు చాలా ఆఫర్లు ఇచ్చినా.. బయటికి వెళ్లలేదు. అయితే.. ఒక మిస్టరీ స్పిన్నర్ అయినా నరైన్.. ఓపెనర్‌గా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ.. మంగళవారం రాజస్థాన్‌పై ఏకంగా సెంచరీ బాదేశాడు. అయితే.. నరైన్ ఈ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడంటే అందుకు కారణమైన ఓ వ్యక్తి ఉన్నాడు. నిజానికి అతను నరైన్ వెనకున్న శక్తి అని చెప్పాలి. మరి ఆ శక్తి లాంటి వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక కప్పులు సాధించిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు ఐదేసి సార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించాయి. ఈ రెండు జట్ల తర్వాత అత్యధిక కప్పులు సాధించిన టీమ్ కోల్‌కత్తా నైట్ రైడర్స్. రెండు సార్లు కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2012, 2014లో గౌతమ్ గంభీర్ కెప్లెన్సీలో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. అయితే.. కేకేఆర్‌కు గౌతమ్ గంభీర్ కెప్టెన్ కాకముందు ఆ జట్టును ఓ సాధారణ టీమ్‌గా చూసేవాళ్లు. ఎందుకంటే.. గట్టి పోటీ ఇచ్చేది కాదు. కానీ, గంభీర్ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కేకేఆర్ పూర్తిగా మారిపోయింది. ఒక ఛాంపియన్ టీమ్‌లా తయారైంది. గంభీర్ దూరమైన తర్వాత మళ్లీ కేకేఆర్ ఓ సాదాసీదా టీమ్‌లా మారిపోయింది. అయితే తిరిగి కేకేఆర్ మెంటర్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఓ డిఫెరెంట్ టీమ్‌లా కేకేఆర్ కనిపిస్తోంది, డిఫరెంట్‌గా ఆడుతోంది కూడా. ఈ మార్పు.. గంభీర్ టీమ్‌లో చేసిన మార్పులు చేర్పుల కారణంగా వచ్చిందే.
గంభీర్ చేసిన మార్పుల్లో ప్రధానమైంది.. మిస్టరీ స్పిన్నర్ అయిన సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా దింపడమే. నరైన్ బలమేంటో బాగా తెలిసిన గంభీర్.. కేవలం పవర్‌ప్లేలో తన పవర్ హిట్టింగ్‌లో మంచి స్టార్ట్ ఇచ్చేందుకే నరైన్‌ను ఓపెనర్‌గా దింపుతున్నాడు. నరైన్ లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన పనిలేదు, వికెట్లు కావాడుకుంటూ బాధ్యతాయుతంగా ఆడాల్సిన పని కూడా లేదు. కేవలం వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలిస్తే చాలు. ఎంత సేపు క్రీజ్‌లో ఉన్నాడు, ఎన్ని ఓవర్లు ఆడాడు అన్నది ముఖ్యంగా కాదు.. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే చాలు. ఇదే నరైన్ నుంచి గంభీర్ ఆశించింది. దాన్ని వందకు వందశాతం నరైన్ చేసి చూపిస్తున్నాడు.
నెట్స్‌లో నరైన్ హిట్టింగ్, స్ట్రోక్ మేకింగ్ ఎబిలిటీని చూసిన గంభీర్.. తాను కేకేఆర్ కెప్టెన్ ఉన్న టైమ్‌లో.. 2017లో తొలి సారి నరైన్‌ను ఓపెనర్‌గా పంపించాడు. అప్పుడు కూడా నరైన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్‌లో 224 పరుగులు, 2018లో 357 పరుగులు చేసి ఓపెనర్‌గా దుమ్మురేపాడు. గంభీర్ కేకేఆర్‌ను వీడిన తర్వాత నరైన్ మళ్లీ లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చి పెద్దగా రాణించలేదు. కానీ, ఇప్పుడు కేకేఆర్ మెంటర్‌గా ఉన్న గంభీర్ మరోసారి నరైన్‌లో ఓపెనింగ్ విధ్వంస వీరుడ్ని నిద్రలేపాడు. అంతే.. ఓపెనింగ్ జోడీ సమస్య తీరిపోయింది, పవర్ ప్లేలో భారీగా రన్స్ వస్తున్నాయి. గంభీర్‌కు వచ్చిన ఒక్క ఐడియా.. మిస్టరీ స్పిన్నర్‌గా ఉన్న నరైన్‌ను పవర్ హిట్టర్‌గా మార్చింది. కేకేఆర్‌కు బెస్ట్ ఓపెనర్‌ను ఇచ్చింది. అందుకే నరైన్ బ్యాటింగ్ వెనుకున్న అద్భుత శక్తి గౌతమ్ గంభీర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rinku Singh said, “I really like the thought process of Gautam Gambhir, he sent Sunil Narine as an opener again this season which was fantastic”. pic.twitter.com/01sA5uFmIn
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2024