Nidhan
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారనేది చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న అంశం. ఎట్టకేలకు దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారనేది చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న అంశం. ఎట్టకేలకు దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.
Nidhan
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారనేది చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న అంశం. టీ20 వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ఇదే డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం రాహుల్ ద్రవిడ్ ఆ పోస్ట్ నుంచి తప్పుకోవడమే. మెగాటోర్నీ ఫైనల్‌తో కోచ్ పదవికి గుడ్‌బై చెప్పేశాడతను. అందుకే ప్రపంచ కప్ మొదలవక ముందు నుంచే ద్రవిడ్‌కు వారసుడ్ని వెతికే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు. కోచ్ రేసులో చాలా పేర్లు వినిపించాయి. పలువురు దేశీ దిగ్గజాలతో పాటు ఫారెన్ లెజెండ్స్ పేర్లు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ మధ్యే బీసీసీఐ హెడ్ కోచ్ పోస్ట్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూతో గౌతం గంభీర్ నెక్స్ట్ కోచ్ అనేది దాదాపుగా ఖాయమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
కోచ్ పోస్ట్‌పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. భారత నయా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా ప్రకటించారు. గంభీర్‌కు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందన్నాడు. వేగంగా మారుతున్న మోడ్రన్ క్రికెట్‌ను గౌతీ దగ్గర నుంచి చూశాడని తెలిపాడు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో విభాగాల్లో రాణించాడని.. ఇండియన్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేశాడంటూ గంభీర్‌ను ప్రశంసల్లో మంచెత్తాడు జైషా. ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. ఈ కొత్త ప్రయాణంలో గంభీర్‌కు భారత క్రికెట్ బోర్డు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశాడు జైషా. మరి.. కొత్త కోచ్‌గా గంభీర్ రాకపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
– 2007 World Cup winner.
– 2011 World Cup winner.
– 2012 IPL winner.
– 2014 IPL winner.
– 2024 IPL winning team mentor.NOW TEAM INDIA’S HEAD COACH, THE GG ERA BEGINS…!!! 🇮🇳 pic.twitter.com/NcWpJPQAs0
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024