Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్‌కి కారణం అతనేనా? అంతా BCCIకి తెలిసే జరిగిందా?

టీమిండియా పొట్టి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఊహించని నిర్ణయం తీసుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. నెక్ట్స్ జనరేషన్ కోసం టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ షాకింగ్ డెెసిషన్ వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, ఇదంతా బీసీసీఐకి తెలిసే జరుగుతోందని ఫ్యాన్స్, నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

టీమిండియా పొట్టి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఊహించని నిర్ణయం తీసుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. నెక్ట్స్ జనరేషన్ కోసం టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ షాకింగ్ డెెసిషన్ వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, ఇదంతా బీసీసీఐకి తెలిసే జరుగుతోందని ఫ్యాన్స్, నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

విరాట్ కోహ్లీ.. లీగ్ మ్యాచ్ ల్లో ఎన్ని రన్స్ చేస్తే ఏం లాభం? ఫైనల్లో కొట్టి.. జట్టును గెలిపిస్తేనే కిక్కొస్తుంది అనుకున్నాడో ఏమో? బహుశా అందుకే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దుమ్మురేపాడు రన్ మెషిన్. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అన్నట్లు ఈ మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాడు. 34 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను అక్షర్ పటేల్ తో కలిసి గట్టెక్కించాడు. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకమైంది. కాగా.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20లకు విరాట్ రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో అందరూ షాక్ కు గురైయ్యారు. అయితే కోహ్లీ రిటైర్మెంట్ కు కారణం అతడేనా? అంతా బీసీసీఐకి తెలిసే జరిగిందా? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ 2024ను సగర్వంగా ముద్దాడింది టీమిండియా. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టైటిల్ పోరులో 7 రన్స్ తో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దాంతో 13 సంవత్సరాల వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుంది. ఇదిలా ఉండగా.. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్ ల్లో విఫలం అయ్యి విమర్శలు మూటగట్టుకున్న కింగ్ కోహ్లీ.. ఫైనల్ మ్యాచ్ లో తన విలువేంటో తెలియజేశాడు. 34 రన్స్ కే 3 కీలకమైన వికెట్లు కోల్పోయిన దశలో జట్టుకు ఆపద్భాంధవుడిలా నిలిచాడు. అక్షర్ పటేల్ తో కలిసి సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ మ్యాచ్ ఓవరాల్ గా 59 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి.. జట్టుకు వరల్డ్ కప్ ను అందించాడు. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో.. విరాట్ కోహ్లీ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

“ఇదే నా చివరి వరల్డ్ కప్, టీ20 మ్యాచ్ కూడా. యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను వెనక్కి తగ్గుతున్నాను” అంటూ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. దాంతో టీ20ల్లో విరాట్ ఇక కనిపించడని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే? విరాట్ కోహ్లీని కావాలనే బలవంతంగా రిటైర్ చేశారా? ఇదంతా బీసీసీఐకి తెలిసే జరిగిందా? కోహ్లీ రిటైర్మెంట్ కు కారణం గౌతమ్ గంభీరేనా?అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. ఈ క్వశ్చన్స్ రావడానికి కారణం లేకపోలేదు.

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతారని అందరూ భావించారు. అలాగే జరిగింది కూడా. అయితే విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ చూస్తే.. ఇంకొన్నాళ్లు టీ20ల్లో కొనసాగే అవకాశం ఉంది. కానీ కోహ్లీ ఎందుకో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయం వెనక గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే? టీమిండియా హెడ్ కోచ్ గా దాదాపుగా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాను హెడ్ కోచ్ అయితే సీనియర్లను తీసేయడానికి తాను వెనకాడనని గంభీర్ బీసీసీఐకి చెప్పకనే చెప్పాడు. పైగా గంభీర్ కు విరాట్ కు మధ్య గతంలో గొడవలు జరిగిన విషయం తెలియనిది కాదు. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకునే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఇదంతా బీసీసీఐ కనుసన్నల్లోనే జరిగిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments