SNP
Gary Kirsten, Virat Kohli, Rohit Sharma, IND vs PAK, T20 World Cup 2024: పాకిస్థాన్ అంటే చాలా విరుచుకుపడే కోహ్లీ మొన్నటి మ్యాచ్‌లో 4 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. వీరిద్దరి ఫెల్యూర్ వెనుక ఒకడున్నాడు. వాడు మనోడే.. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Gary Kirsten, Virat Kohli, Rohit Sharma, IND vs PAK, T20 World Cup 2024: పాకిస్థాన్ అంటే చాలా విరుచుకుపడే కోహ్లీ మొన్నటి మ్యాచ్‌లో 4 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. వీరిద్దరి ఫెల్యూర్ వెనుక ఒకడున్నాడు. వాడు మనోడే.. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం(జూన్ 9) న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో పాక్‌పై లో స్కోరింగ్ గేమ్‌లో గెలిచింది. టాస్ ఓడి, పిచ్ కండీషన్లకు వ్యతిరేకంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను పాకిస్థాన్ బౌలర్లు కేవలం 119 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో.. అంతా పాకిస్థాన్ విజయం ఖాయం అనుకున్నారు. కానీ, టీమిండియా బౌలర్లు అంతకంటే అద్భుతం చేసి చూపించారు. తమ పదునైన బంతులతో పాక్ బ్యాటర్ల చేతులు కట్టేసి.. 20 ఓవర్లలో కేవలం 113 పరుగులకే వారిని కట్టడి చేశారు.
అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు రెండు కళ్లలాంటి స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా తక్కువ పరుగులకే అవుట్ కావడం వెనుక పిచ్ బౌలింగ్‌ను అనుకూలంగా ఉండటమే కారణం అని చాలా మంది అనుకున్నారు. కానీ, అసలు నిజం అది కాదు. కోహ్లీ, రోహిత్‌ను పక్కా ప్లాన్ ప్రకారం అవుట్ చేయడం వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. ఆ మాస్టర్ మైండ్ ఒకప్పుడు టీమిండియా కోసమే పనిచేసింది. భారత్‌కు వరల్డ్ కప్ కూడా అందించిన అతనే ఇప్పుడు.. మనకు వ్యతిరేకంగా మారి కోహ్లీ, రోహిత్‌ను దెబ్బతీశాడు. పాక్‌తో ఉన్న ఆ మనోడు ఎవరు? కోహ్లీ, రోహిత్‌ను ఎలా తక్కువ స్కోర్‌కే అవుట్ చేయించగలిగాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధోని కెప్టెన్సీలో టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. 1983 తర్వాత.. దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. భారత జట్టు స్వదేశంలోనే వరల్డ్ కప్ గెలిచింది. 2011 అనగానే చాలా మందికి ధోని చివరి సిక్స్, ఫైనల్లో గంభీర్ పోరాటం, సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ జోడీ, యువరాజ్ సింగ్ చేసిన యుద్ధం, జహీర్ ఖాన్ సూపర్ బౌలింగ్ ఇలా చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. కానీ, అప్పుట్లో టీమిండియాను అద్భుతంగా తీర్చిదిద్దిన హెడ్ కోచ్ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. అప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నది సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ క్రిస్టన్. అతని కోచింగ్‌లోనే 2011లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే.. ఆ గ్యారీ క్రిస్టన్ ఇప్పుడు పాకిస్థాన్‌కు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
పాక్ కోచ్‌గా గ్యారీ పనిచేసినంత మాత్రానా టీమిండియాకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ, టీమిండియాలోకి ప్రధాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కొంత నష్టం అయితే జరిగింది. పాకిస్థాన్ అంటే చాలు ఎలాంటి పిచ్ అయినా చెలరేగి ఆడే విరాట్ కోహ్లీ మొన్నటి మ్యాచ్‌లో కేవలం 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఇదే న్యూయార్క్ పిచ్‌పై ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గతంలో పాక్ బౌలింగ్‌ను చీల్చిచెండాడిని ఈ ఇద్దరు.. ఈసారి విఫలం అయ్యారు. కోహ్లీ, రోహిత్ వైఫల్యం వెనుక గ్యారీ క్రిస్టన్ హస్తం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అది ఎలాగంటే.. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాలో యంగ్ ప్లేయర్లుగా ఉన్నారు.
సో.. కోహ్లీ, రోహిత్ బలం ఏంటి, వారి బలహీనతలు ఏంటి అనే విషయం గ్యారీకి బాగా తెలుసు. అందుకే.. కోహ్లీకి ఆఫ్ స్టంప్‌కు బాగా దూరంగా బంతులు వేయించి అవుట్ చేయించాడు. అలాగే రోహిత్ శర్మకు ప్యాడ్లపై స్లో బాల్స్ వేయించి గాల్లోకి ఆడించి అవుట్ చేయించాడు. టీమిండియా ప్రధాన బలం అయినా ఈ ఇద్దర్ని అవుట్ చేస్తే చాలు మ్యాచ్ గెలిచినట్లే అని గ్యారీ భావించాడు. తాను అనుకున్నది అనుకున్నట్లు చేశాడు కూడా. పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని పాక్ బౌలర్లు మిగతా భారత బ్యాటర్లను అవుట్ చేసి.. టీమిండియా 119 పరుగులకే కుప్పకూల్చారు. బుమ్రా అండతో టీమిండియా ఆ స్కోర్‌ను కాపాడుకోగలిగింది కానీ, లేదంటే.. ఒకప్పుడు మనకు వన్డే వరల్డ్ కప్ అందించి మనోడిగా పేరు తెచ్చుకున్న గ్యారీ క్రిస్టన్ టీమిండియాకు దెబ్బేసేవాడే అని క్రికెట్ అభిమానులు కూడా అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Speed’s reaction when Virat Kohli got out last night. pic.twitter.com/Ae40YGJ6c6
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2024