iDreamPost
android-app
ios-app

MS Dhoni: వీడియో: కెమెరామెన్ ని ఓ ఆటాడుకున్న ధోని! ఏం చేశాడో మీరే చూడండి!

  • Published Apr 24, 2024 | 12:54 PM Updated Updated Apr 24, 2024 | 12:54 PM

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి కెమెరామెన్ కి మధ్య ఓ సన్నివేశం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి కెమెరామెన్ కి మధ్య ఓ సన్నివేశం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

MS Dhoni: వీడియో: కెమెరామెన్ ని ఓ ఆటాడుకున్న ధోని! ఏం చేశాడో మీరే చూడండి!

మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. తాను ఎదుర్కొంటున్నది తక్కువ బంతులే అయినప్పటికీ.. పరుగులు మాత్రం దంచికొడుతున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్ కు మెునగాడిగా ధోని మారాడు. దీంతో పాటుగా తన ఎక్స్ పీరియన్స్ ను యంగ్ కెప్టెన్ రుతురాజ్ కు సలహాలు, సూచనల రూపంలో ఇస్తూనే ఉన్నాడు. అయితే గ్రౌండ్ లో ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని.. డ్రస్సింగ్ రూమ్ లో మాత్రం వివిధ వేరియేషన్స్ లో కనిపిస్తూ ఉంటాడు. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో కెమెరామెన్ కి ధోనికి మధ్య ఓ సరాదా సన్నివేశం జరిగింది.

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో చిత్తైంది. దీంతో ఈ సీజన్ లో వరుసగా రెండోసారి రాహుల్ జట్టుపై ఓడిపోయింది సీఎస్కే. చెన్నై కెప్టెన్ రుతురాజ్(108) సెంచరీతో చెలరేగడంతో పాటుగా దుబే 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 66 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 210 పరుగుల భారీ స్కోర్ చేసింది చెన్నై టీమ్. అనంతరం 211 లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది లక్నో. మార్కస్ స్టోయినిస్(124*) భారీ శతకంతో దంచికొట్టి లక్నోకు అఖండ విజయాన్ని అందించాడు. ఇక్కడి వరకు అందరికి తెలిసిన విషయమే. ఇక ఈ మ్యాచ్ లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

చెన్నై టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 17వ ఓవర్ వేయడానికి వచ్చాడు మోసిన్ ఖాన్. ఈ ఓవర్ లో కెమెరామెన్ డ్రస్సింగ్ రూమ్ లో ఉన్న ధోనిపై ఫోకస్ చేశాడు. దీంతో ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ పై ధోని మెరిశాడు. ఇది గమనించిన మిస్టర్ కూల్.. కెమెరామెన్ పైకి బాటిల్ విసిరినట్లు చేశాడు. అక్కడ గ్రౌండ్ లో గైక్వాడ్-దుబేలు దంచికొడుతుంటే.. నువ్వు నాపై కెమెరా పెట్టావ్ అన్న ఉద్దేశంతో సరదాగా ధోని ఇలా కెమెరామెన్ ను ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. గ్రౌండ్ ప్లేయర్ల ఆటను బయటి నుంచే గమనిస్తూ.. వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు ధోని. ఈ క్రమంలో అతడు ఇచ్చే రియాక్షన్స్ వైరల్ గా మారుతూ ఉంటాయి. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş