బ్రావోకు షేక్ హ్యాండ్ ఇవ్వని ధోని! ఇది లైవ్‌లో కూడా చూసి ఉండరు!

MS Dhoni, Dwayne Bravo, CSK vs GT: ఐపీఎల్‌ 2024లో చెన్నై వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే సూపర్‌ విక్టరీ కొట్టింది. అయితే.. మ్యాచ్‌ తర్వాత ధోని.. ఆ జట్టు బౌలింగ్‌కోచ్‌ బ్రావోకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి ధోని ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, Dwayne Bravo, CSK vs GT: ఐపీఎల్‌ 2024లో చెన్నై వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే సూపర్‌ విక్టరీ కొట్టింది. అయితే.. మ్యాచ్‌ తర్వాత ధోని.. ఆ జట్టు బౌలింగ్‌కోచ్‌ బ్రావోకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి ధోని ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హోం టీమ్‌ సీఎస్‌కే ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత ఓ సంఘటన జరిగింది. అది కూడా సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌కి, అలాగే ఆ జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఆ టీమ్‌కు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న డ్వాన్‌ బ్రావోకి మధ్య జరిగింది. సాధారణంగా ధోని గ్రౌండ్‌లో చాలా సీరియస్‌గా, గంభీరంగా ఉంటాడు. చాలా తక్కువ మందితో మాత్రమే ధోని క్లోజ్‌గా, జోవిల్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ తర్వాత తనకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు వచ్చిన బ్రావోకు ధోని ఊహించని ఝలక్‌ ఇచ్చాడు. అతని షేక్‌ ఇవ్వకుండా ఆటపట్టించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌ గెలిచిన తర్వాత.. సీఎస్‌కే ఆటగాళ్లంతా గ్రౌండ్‌ వీడి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు వస్తున్నారు. ఎదురుగా వచ్చిన బ్రావో ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు హగ్‌ ఇచ్చి.. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వెనకే వస్తున్న ధోనికి కూడా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు. కానీ, ధోని షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా చిన్న ఝలక్‌ ఇచ్చాడు. దాంతో ధోనిలో ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటూ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. ధోని-బ్రావో మధ్య ఉన్న బాండింగ్‌కు ఇది నిదర్శనం అంటూ పేర్కొంటున్నారు. కాగా, ధోని, బ్రావో కలిసి చెన్నైకు చాలా కాలం ఆడిన విషయం తెలిసిందే. ఆ ఫ్రెండ్షిప్‌ కొద్ది ధోని అలా చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ 46, రచిన్‌ రవీంద్ర 46 పరుగులతో శుభారంభం అందించారు. శివమ్‌ దూబే సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 51 పరుగులు చేసి దుమ్మురేపాడు. డారిల్‌ మిచెల్‌ సైతం 24 పరుగులు చేశాడు. దీంతో సీఎస్‌కేకు భారీ స్కోర్ దక్కింది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లతో రాణించాడు. 207 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌.. 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి కేవలం 148 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. జీటీలో సాహా 21, సాయి సుదర్శన్‌ 37, మిల్లర్‌ 21 రన్స్‌తో పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌, ముస్తఫిజుర్‌ రెహమాన్‌, దేశ్‌పాండే రెండేసి వికెట్లతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో ధోని, బ్రావో మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments