SNP
SNP
టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ-హార్డిక్ పాండ్యా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కోహ్లీ అంటే పాండ్యా ఎనలేని ప్రేమా అభిమానం చూపిస్తుంటాడు. టీమిండియాలో గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరని ఎదురైన ప్రశ్నకు సచిన్‌ను కాదని కోహ్లీ పేరు చెప్పాడు పాండ్యా. అది కోహ్లీపై పాండ్యాకున్న అభిమానం. వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి కొత్త చెప్పుకోవాల్సింది ఏం లేకపోయినా.. వెస్టిండీస్ టూర్ సందర్భంగా వీరి మధ్య ఓ సరదాగా సంఘటన చోటు చేసుకుంది.
గురువారం జరిగిన తొలి వన్డే కంటే ముందు విరాట్ నెట్స్ తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అలాగే పాండ్యా కూడా బౌలింగ్‌లో చెమలు చిందించాడు. అయితే.. వీరిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఈ ప్రాక్టీస్‌లో హార్దిక్ పాండ్యా సంధించిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంఫ్ బంతిని కోహ్లీ తన ట్రెడ్ మార్క్ షాట్ అయిన కవర్ డ్రై ఆడాడు. కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఇబ్బంది పడతాడనే విమర్శ ఉంది. దాన్ని అధిగమించేందుకు కోహ్లీ కూడా చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందుకే.. పాండ్యా బౌలింగ్ కూడా అలానే అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ వేశాడు.
అయితే.. ఆ బాల్‌ను సమర్థవంతంగా ఆడిన కోహ్లీ మంచి కవర్ డ్రై షాట్ ఆడాడు. దీంతో పాండ్యా షాక్ అయ్యాడు. వెంటనే కోహ్లీ.. పాండ్యాను ఎక్కిరిస్తూ.. ఫోర్ కొట్టినట్లు స్టెప్పులేస్తూ బౌండరీ సిగ్నల్ ఇస్తున్నట్లు చూపించాడు. ఇలా కోహ్లీ సరదాగా పాండ్యాను ఆటపట్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఈ వీడియోను చూసి.. కోహ్లీ అల్లరి చేష్టలు భలే ఉంటాయంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కిందున్న వీడియోను మీరూ చేసేసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 27, 2023
ఇదీ చదవండి: వయసు అయిపోయిందంటారు.. వాళ్లు లేకుంటే టీమ్‌లో పసే లేదు!