iDreamPost
android-app
ios-app

వీడియో: విసిగిస్తున్న బౌలర్‌ను కొట్టేందుకు దూసుకెళ్లిన రోహిత్‌ శర్మ!

  • Published Aug 05, 2024 | 11:05 AM Updated Updated Aug 05, 2024 | 11:05 AM

Rohit Sharma, Washington Sundar, IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ చేసిన ఒక పని వైరల్‌గా మారింది. ఓ బౌలర్‌పైకి దూసుకెళ్లాడు. రోహిత్‌ అలా ఎందుకు చేశాడు? ఆ బౌలర్‌ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Washington Sundar, IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ చేసిన ఒక పని వైరల్‌గా మారింది. ఓ బౌలర్‌పైకి దూసుకెళ్లాడు. రోహిత్‌ అలా ఎందుకు చేశాడు? ఆ బౌలర్‌ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 05, 2024 | 11:05 AMUpdated Aug 05, 2024 | 11:05 AM
వీడియో: విసిగిస్తున్న బౌలర్‌ను కొట్టేందుకు దూసుకెళ్లిన రోహిత్‌ శర్మ!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బయట ఎంత ఫన్నీగా ఉంటాడో.. మ్యాచ్‌లో అంతే సీరియస్‌గా ఉంటాడు. మ్యాచ్‌ గెలిచేందుకు తన వంద శాతం ఎఫర్ట్‌ పెట్టడంతో పాటే, జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా అలెర్ట్‌గా ఉండలా చూసుకుంటాడు. చాలా సార్లు ఆటగాళ్లపై సీరియస్‌ కూడా అవుతుంటాడు. అలాగే కొన్ని సార్లు ఫన్నీ ఫన్నీ థింక్స్‌ చేస్తుంటాడు. తాజాగా శ్రీలంకతో రెండో వన్డే సందర్భంగా ఓ బౌలర్‌పై సరదాగా దూసుకెళ్లాడు రోహిత్‌ శర్మ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ఓడిపోయినా.. రోహిత్‌ చేసిన ఈ పనితో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌.. బౌలింగ్‌ చేస్తూ బాల్‌ను రిలీజ్‌ చేసే ముందు ఏదో అసౌకర్యం కలిగి బాల్‌ను డెలవరీ చేయకుండా ఆపాడు. మళ్లీ ఆ బాల్‌ వేసేందుకు వచ్చి అలాగే చేశాడు. దాంతో.. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ.. సరదాగా వాషింగ్టన్‌ సుందర్‌ను కొట్టేందుకు వెళ్లాడు. ఈ ఫన్నీ సీన్‌ చూసి.. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ బాగా నవ్వుకున్నాడు. తాజాగా సోషల్‌ మీడియలో ఆ వీడియోను భారత క్రికెట్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. రోహిత్‌ ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ అంటూ పేర్కొంటున్నారు.

మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌తో అభిమానులు కొంత సంతోసంగా ఉన్నా.. కేవలం 241 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక టీమిండియా ఓడిపోవడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో రాణించినా.. తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించినా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అవ్వడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా.. కాస్త జాగ్రత్తగా ఆడి.. చివరి వన్డేలోనైనా గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేయాలని కోరుకుంటున్నారు. లేదంటే.. టీమిండియా పరువు పోవడం ఖాయం అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.