SNP
Suryakumar Yadav, Rashid Khan, IND vs AFG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, రషీద్ ఖాన్ గొడవ పడ్డారు. ఆ గొడవ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Suryakumar Yadav, Rashid Khan, IND vs AFG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, రషీద్ ఖాన్ గొడవ పడ్డారు. ఆ గొడవ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. సూపర్-8 స్టేజ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 47 పరుగులతో గెలిచిన రోహిత్ సేన.. మంచి స్టార్ అందుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, ఆఫ్ఘాన్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బహుషా మ్యాచ్ లైవ్‌లో ఈ ఘటన చూపించకపోవడంతో చాలా మందికి ఈ గొడవ గురించి తెలియరాలేదు.
ఇంతకీ ఇద్దరి మధ్య అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. రషీద్ ఖాన్ బౌలింగ్‌ను స్వీప్ షాట్లతో అద్భుతంగా టాకిల్ చేస్తున్నాడు సూర్య భాయ్. అతని స్వీప్ షాట్స్‌కు విసిగిపోయిన రషీద్ ఖాన్.. సూర్య దగ్గరకు వెళ్లి ఆ షాట్స్ ఆడవద్దని హెచ్చరించాడు. స్వీప్ షాట్స్ ఆడితే బాగుండదని సరదాగా చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఫన్నీ ఫైట్ జరిగింది. రషీద్ వార్నింగ్ తర్వాత సూర్య స్వీప్ షాట్స్‌తోనే రెండు బౌండరీలు, ఓ సిక్స్ బాదడం విశేసం. ఈ ఘటనకు సంబంధించి ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. స్వీప్ షాట్స్ ఆడవద్దని రషీద్.. సూర్యని రిక్వెస్ట్ చేస్తే, అందులో తన తప్పులేదని సూర్య బదులిచ్చినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫారూఖీ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అర్షదీప్ మూడేసి వికెట్లతో టీమిండియాకువ విజయాన్ని అందించారు. మరి ఈ మ్యాచ్‌లో సూర్య, రషీద్ మధ్య జరిగిన ఫన్నీ ఫైట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.