క్రికెట్ చరిత్రలో మీరు ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు చూసుంటారు. డైవ్ చేసి క్యాచ్ పట్టడం, గాల్లోకి ఎగిరి గంతేసి బాల్ ను ఒడిసి పట్టడం, ఒంటి చేత్తో క్యాచ్ పట్టడం లాంటి విన్యాసాలు మనం ఎన్నో చూశాం. కానీ తాజాగా ఓ మ్యాచ్ లో అరుదైన క్యాచ్ నమోదైంది. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్ లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. చూసే వారికి నవ్వు తెప్పిస్తున్న ఈ క్యాచ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్ లో బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెసిందే. ఫోర్లు, సిక్సర్లతో లీగ్ హోరెత్తుతోంది. ఇక ఈ లీగ్ లో తాజాగ జరిగిన మ్యాచ్ లో చిత్ర విచిత్రమైన క్యాచ్ నమోదు అయ్యింది. బహుశా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి క్యాచ్ మీరింత వరకు చూసుండరు. టీ20 బ్లాస్ట్ లీగ్ లో భాగంగా.. నాటింగ్ హామ్ షైర్ వర్సెస్ లీసెస్టర్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నాటింగ్ హామ్ షైర్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ఓ చిత్రమైన క్యాచ్ నమోదు అయ్యింది.
లీసెస్టర్ షైర్ ఇన్నింగ్స్ లో 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు నాటింగ్ హామ్ బౌలర్ స్టీవెన్ ముల్లానీ. ఈ ఓవర్ తొలి బంతిని లీసెస్టర్ కెప్టెన్ కోలిన్ అకెర్మాన్ స్ట్రైట్ గా ఆడాడు. దాంతో వేగంగా వచ్చిన బంతి నేరుగా వెళ్లి బౌలర్ చేతిలో పడింది. కానీ పట్టుతప్పడంతో.. బాల్ గాల్లోకి ఎగిరి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న వియాన్ ముల్డర్ కు తాకింది. వెంటనే బౌలర్ మరోసారి బాల్ ను ఒడిసిపట్టుకున్నాడు. దాంతో అకెర్మాన్ ఔట్ అయ్యాడు. నాన్ స్ట్రైకర్ బ్యార్ కొంచెం పక్కకు జరిగి ఉంటే బౌలర్ కు బాల్ అందుకునే అవకాశం ఉండకపోయేది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇదేం క్యాచ్.. నేనెక్కడా చూడ్లా అంటూ కొందరు అంటే.. దురదృష్టం అంటే నిదే బాసు అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకొచ్చారు.