SNP
క్రికెట్‌లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అవుట్‌ల విషయంలో చాలా అనుమానాలు తలెత్తుంటాయి. ఈ అవుట్‌పై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
క్రికెట్‌లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అవుట్‌ల విషయంలో చాలా అనుమానాలు తలెత్తుంటాయి. ఈ అవుట్‌పై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
క్రికెట్‌లో చాలా రూల్స్ ఉంటాయి. రన్స్, అవుట్స్, నో బాల్, వైడ్ బాల్ ఇలాంటి బేసిక్ రూల్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కానీ, అరుదైన సందర్భాల్లో మాత్రం అంపైర్లు కూడా రూల్స్ తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యూవేషన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి క్రికెట్ అభిమానులే కాదు.. క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
బౌలర్ వేసిన బాల్ నేరుగా బ్యాటర్ మీదుకు దూసుకొచ్చింది. సీదా బాడీ పైకి దూసుకురావడంతో బ్యాటర్ ఆ బంతిని ఎందుర్కొలేక దాని నుంచి తప్పించుకోవడానికి కిందికి కూర్చున్నాడు. అలా కూర్చోకపోయి ఉంటే.. అతను గాయపడేవాడు. అయితే.. చాలా వేగంగా వస్తున్న బాల్ నుంచి తప్పించుకోవడానికి అతను అలా కూర్చుంటే.. బాల్ నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ను తాకింది. దీంతో.. అవుట్ అనుకుని బౌలర్‌తో పాటు ఫీల్డర్లంతా సంబురాలు చేసుకున్నారు.
ఇంతలో అందరికీ షాకిస్తూ.. అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. ఫుట్ నో బాల్ అయిఉంటుందిలే అనుకుంటే.. బౌలర్ కరెక్ట్‌గా లీగల్ డెలవరీనే వేశాడు. అయినా కూడా అంపైర్ నో బాల్ ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. అసలు అది ఎలా నో బాల్ అవుతుంది అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. బీమర్ అయితే నో బాల్ ఇవ్వొచ్చు, కానీ బాల్ వికెట్లను తాకింది కదా? బ్యాటర్‌ను బాల్ పాస్ అయ్యే సమయంలో నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే అది నో బాల్ అవుతుంది.
కానీ, బాల్ వికెట్లను తాకితే అది కరెక్ట్ బాలే అవుతుంది కదా అని చాలా మంది క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ బాల్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే.. క్రికెల్ రూల్స్ ప్రకారం 41.7 లా ప్రకారం బ్యాటర్ క్రీజ్‌లో ఉండి బాల్ అతని నడుము పై భాగం నుంచి వెళ్తే.. అది నో బాల్. వికెట్లకు తగిలినా కూడా దాన్ని నో బాల్ కిందే పరిగణిస్తారు. ఈ వీడియోలో కూడా బాల్ బ్యాటర్ నడుము పై నుంచి పాస్ అయి.. వికెట్లను తాకింది. దీంతో అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Under Law 41.7 , it’s a No ball as soon as it passes the batsmen (if the batsman is inside the popping crease). So it doesn’t matter that it hit the wicket – it’s still a No ball and therefore the batsman cannot be ruled out. pic.twitter.com/2voG8vm8Cm
— Sayyad Nag Pasha (@nag_pasha) February 14, 2024