క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ!

IND vs PAK, Asia Cup 2024, Women's Cricket: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురు చూసే క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌. స్టేడియంలో ఫ్రీగా వెళ్లి మ్యాచ్‌ చూసే అవకాశం కల్పిస్తోంది క్రికెట్‌ బోర్డు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IND vs PAK, Asia Cup 2024, Women's Cricket: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురు చూసే క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌. స్టేడియంలో ఫ్రీగా వెళ్లి మ్యాచ్‌ చూసే అవకాశం కల్పిస్తోంది క్రికెట్‌ బోర్డు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయి.. స్టేడియంలో మ్యాచ్‌ చూసేందుకు టిక్కెట్ల కోసం ఎగబడే ఏకైక మ్యాచ్‌ ఏంది అంటే అది భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌. పైగా ఆ మ్యాచ్‌ ఏ వరల్డ్‌ కప్‌ టోర్నీలోనో, ఆసియా కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలోనో జరిగితే.. ఇక క్రికెట్‌ అభిమానులు ఊగిపోతారు. అలాంటి మ్యాచ్‌కు సంబంధించి.. వేలు, లక్షలు పెట్టి కూడా టిక్కెట్‌ కొనే వాళ్లు ఉన్నారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ అందింది.

ఉమెన్స్‌ ఆసియా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2024 జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం స్టేడియంలో ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. జులై 19న మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో యూఏఈతో నేపాల్ తలపడనుంది. అదే రోజు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే.. ఉమెన్స్‌ క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు లంక క్రికెట్‌ బోర్డు వైస్ ప్రెసిడెంట్ విక్రమరత్నె తెలిపారు. జులై 28 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.

8 టీమ్స్‌ను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌-ఏలో ఇండియా, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్‌ ఉన్నాయి. అలాగే గ్రూప్‌-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా జట్లు ఉన్నాయి. ఆయా గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. హర్మన్‌ఫ్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. కాగా, అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోని దంబుల్లాలోనే జరగనున్నాయి. గ్రూప్ దశలో టీమిండియా తమ మ్యాచ్‌లను.. జులై 19న జు పాకిస్థాన్‌తో, 21న యూఏఈతో, జులై 23న నేపాల్‌తో తలపడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మరి ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments