Nidhan
క్రికెట్ అభిమానులకు షాక్. తన ఆటతో చాన్నాళ్ల పాటు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించిన ఓ మాజీ ఆటగాడు కన్నుమూశాడు.
క్రికెట్ అభిమానులకు షాక్. తన ఆటతో చాన్నాళ్ల పాటు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించిన ఓ మాజీ ఆటగాడు కన్నుమూశాడు.
Nidhan
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. వెటరన్ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూశాడు. అతడి వయసు 40 సంవత్సరాలు. గత కొంత కాలంగా కాలేయ సంబంధింత వ్యాధితో రోహిత్ బాధపడుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతడు రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ మొత్తంలో 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు రోహిత్ శర్మ. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన అతడు.. అవసరాన్ని బట్టి స్పిన్ బౌలింగ్‌తోనూ జట్టుకు వికెట్లు అందించేవాడు.
రాజస్థాన్ మాజీ క్రికెటర్ అయిన రోహిత్ శర్మ తన కెరీర్లో 1,147 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అతడి పేరు మీద 2 సెంచరీలు కూడా ఉన్నాయి. 2014లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత నయా క్రికెటర్లను తయారు చేసే పనిలో పడ్డాడు రోహిత్. ఈ క్రమంలో ఓ అకాడమీని స్థాపించాడు. అందులో కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. యంగ్ ప్లేయర్స్‌కు క్రికెట్ పాఠాలు చెబుతూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రోహిత్.. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచాడు. దీంతో రాజస్థాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. అతడి మృతికి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరమని అంటున్నారు.
ఇదీ చదవండి: సురేశ్ రైనా సునామి ఇన్నింగ్స్! ఈ వయసులో కూడా ఇదేమి కొట్టుడు స్వామి?
Former Rajasthan cricketer Rohit Sharma dies at 40 after battle with liver issueshttps://t.co/T7RUoaIRxw
— Sports Today (@SportsTodayofc) March 3, 2024